Sachin Tendulkar: పోగాకు వ్యతిరేక దినోత్సవం.. తండ్రి మాటలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన సచిన్ టెండుల్కర్..

World No Tobacco Day 2024: స్టార్ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తన తండ్రి మాటలను ఈ రోజు మరోసారి గుర్తుచేసుకున్నారు.  తన తండ్రి రమేష్ టెండుల్కర్ పోగాకును ప్రమోట్ చేసే ఎలాంటి కార్యక్రమంలో పాల్గొన కూడదని తెల్చిచెప్పినట్లు టెండుల్కర్ వెల్లడించారు.

1 /6

మే 31 వ తేదీన అంతర్జాతీయ పోగాకు వ్యతిరేక దినోత్సవంను జరుపుకుంటారు . దీని ప్రధాన ఉద్దేశ్యం పోగాకు, పోగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని చెప్పడం, అవగాహాన కార్యక్రమాలు చేస్తుఉంటారు. దీని వల్ల కలిగే నష్టాలను కూడా ప్రజలకు చెబుతుంటారు.

2 /6

మనము బైటకు వెళ్లినప్పుడు ధూమపానం, మద్యపానం చేయకూడదని బోర్డులు పెట్టడం గమనిస్తుంటాం. దీన్ని చాలా కొద్ది మాత్రమే ఫాలో అవుతుంటారు. ఇప్పటికి కూడా అందరి ముందే, జనాల మధ్యనే ఎక్కువ మంది ధూమపానం చేస్తుంటారు.. చుట్టుపక్కల జనాలు ఉన్నారని కూడా ఏ మాత్రం ఆలోచించరు. ఇలాంటి పనులు చేయం వల్ల వీరు మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారు ప్రభావానికి గురౌతుంటారు

3 /6

ధూమపానం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి. ఇదిలా ఉండగా.. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మే 31 న పొగాకు వ్యతిరేక దినోత్సవంను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఎక్స్ లో ఒక పోస్టు చేశారు. ఇది వైరల్ గా మారింది.

4 /6

సచిన్ టెండుల్కర్ తన తండ్రి, రమేష్ టెండుల్కర్ క్రికెట్ కెరిర్ ఆరంభంలో ఒక సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. ఎప్పటికి కూడా పోగాను, ధూమపానం, పోగాకుకు సంబంధించిన ఉత్పత్తుల ప్రమోషన్ లలో పాల్గొనవద్దని చెప్పినట్లు సచిన్ గుర్తు చేసుకున్నారు. దీని వల్ల ఎంతో మంది తీవ్రమైన అఘాతంలో కూరుకుపోతారని చెప్పుకొచ్చాడు.

5 /6

ఇప్పటికి తన తండ్రి చెప్పిన మాటలను ఫాలో అవుతున్నానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చెప్పుకొచ్చారు.  మనం మన సమాజం హెల్తీగా ఉండాలంటే పోగాకు ఉత్పత్తులు తీసుకొవడం మానేయాలని కోరారు. దీని వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారికి గురికావాల్సి ఉంటుందని చెప్పారు.

6 /6

ఇక తమ క్రికెట్ ఆరాధ్య దైవం చేసిన ట్విట్ కు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రిప్లై ఇస్తున్నారు. మీ సూచనలు తప్పకుండా పాటిస్తామని కామెంట్లు పెడుతున్నారు. మీకు ఉన్న మంచి క్వాలీటీస్ వల్లే.. క్రికెట్ దేవుడయ్యారని మరికొందరు ఎమోషనల్ గా కూడా కామెంట్లు పెడుతున్నారు.