Rythu Bandhu Scheme: నేటి నుంచి పది రోజుల వరకు రైతుబంధు సాయం, ఖాతాల్లోకి రూ.5 వేలు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత కోసం ప్రవేశపెట్టిన పథకం రైతుబంధు నేటి నుంచి అమలుకానుంది. వర్షాకాలం దఫా నగదు నేటి నుంచి పది రోజులపాటు రైతులకు నేరుగా జమ చేస్తారు. ఈ సీజన్‌తో కలిపి ఇప్పటి వరకు ఏడు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం అందించారు.

Rythu Bandhu Beneficiary List : తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత కోసం ప్రవేశపెట్టిన పథకం రైతుబంధు నేటి నుంచి అమలుకానుంది. వర్షాకాలం దఫా నగదు నేటి నుంచి పది రోజులపాటు రైతులకు నేరుగా జమ చేస్తారు. ఈ సీజన్‌తో కలిపి ఇప్పటి వరకు ఏడు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం అందించారు.

1 /5

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత కోసం ప్రవేశపెట్టిన పథకం రైతుబంధు ఈ ఏడాదికిగానూ జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. వర్షాకాలం దఫా నగదు నేటి నుంచి పది రోజులపాటు రైతులకు నేరుగా జమ చేస్తారు.  (Photo Credit: Twitter) Also Read: Yadadri Temple Photos: యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఫొటోస్

2 /5

63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది మొత్తం కోటిన్నర ఎకరాలకు రైతుబంధు లభించనుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 2,81,865 మంది కొత్త రైతులకు రైతుబంధు వర్తిస్తుంది. గత ఏడాదితో పోల్చితే 66,311 ఎకరాల భూమి అదనంగా సాగవుతుంది. (Photo Credit: Twitter)

3 /5

ఎకరం భూమి గల రైతులకు తొలిరోజు (జూన్ 15న) రైతుబంధు నిధులు విడుదల చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆ తరువాత రెండు, మూడు ఎకరాల రైతులకు రైతుబంధు నగదు బ్యాంకు ఖతాలకు జమ చేయనున్నారు. జూన్ 25వ తేదీ వరకు రైతుబంధు పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క రైతులకు రూ.5000 మేర ఖరీఫ్ సాయం అందనుంది.  Also Read: 10 Babies Born At once: ఒకే కాన్పులో 10 మంది శిశువులు జననం, Guinness World Record

4 /5

ఈ సీజన్‌తో కలిపి ఇప్పటి వరకు ఏడు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం అందించారు. నేడు ఒక ఎకరం ఉండి అర్హులైన లబ్ధిదారులకు ఖరీఫ్ పంట సాయం విడుదల అవుతుంది. Ruthu Bandhu in Telangana అధికారిక వెబ్‌సైట్‌ లో త్వరలో అధికారులు జిల్లాలవారీగా Rythu Bandhu Beneficiary List అప్‌డేట్ చేస్తారు. Also Read: Galaxy S21 Mobiles: రూ.10,000 Cashback ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Samsung

5 /5

రైతు బంధులో భాగంగా రూ.7,508.78 కోట్లను ఖరీఫ్ కాలానికిగానూ తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.5వేల మేర జమచేయనున్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,72,983 మంది అర్హులైన రైతులున్నారు. 12.18 లక్షల ఎకరాల భూమి సాగు చేయగా, ఏకంగా రూ.608 కోట్లు ఈ జిల్లాకు విడుదల చేస్తారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 77వేల ఎకరాలు సాగు అవుతుండగా, రూ.38.39 కోట్లు కేటాయించారు. 39,762 రైతులను అర్హులుగా ప్రకటించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook