RRR Movie Team Jr NTR, Ram Charan Press Meet Photos : రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కానుంది. జక్కన్న తన టీమ్‌తో కలిసి జెట్ స్పీడ్‌తో అన్ని ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నాడు.
RRR Movie Team Jr NTR, Ram Charan, SS Rajamouli, Ajay Devgn, Alia Bhat's Press Meet latest pics : సినిమా ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇక జక్కన్న తన టీమ్‌తో కలిసి జెట్ స్పీడ్‌తో అన్ని ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నాడు. ముంబై, బెంగళూరు, చెన్నై ఇలా ఏరియాలను ఎంతో స్పీడ్‌గా కవర్ చేస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్. జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవ్ గన్ రాంచరణ్, అలియా భట్‌తో పాటు రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీమ్ అన్ని సిటీల్లో ప్రెస్ మీట్లతో బిజీగా ఉంది.
(Images Credit- Twitter)
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్గా రిలీజై సంచలనాలు సృష్టించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ అవుతుంది. మూవీ ప్రమోషన్స్ చాలా వేగంగా సాగుతున్నాయి. ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్లో రామ్‌చరణ్ మినహా మిగతా టీమ్ పాల్గొంది. తర్వాతి ప్రెస్‌మీట్స్‌లో, ప్రమోషన్స్లలో చరణ్ కూడా జాయిన్ అయ్యారు.
ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవ్ గన్ పాత్ర ఎంతో కీలకమని జక్కన్న చెప్పారు. ఆర్ఆర్ఆర్ మూవీపై అజయ్ దేవ్గన్ పాత్ర చాలా ప్రభావం చూపిస్తుందన్నాడు.
రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు సూపర్ స్టార్ ఫ్యామిలీలకు చెందిన వారని.. వారి ఫ్యాన్స్ మధ్య పోటీ అనే ఫీలింగ్ ఉంటోందని చెప్పారు రాజమౌళి. వారిద్దరినీ నటింపజేసి సినిమా తీయడం కాస్త సవాల్‌గా మారిందన్నారు జక్కన్న.
రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు మంచి స్నేహితులని.. వారి మధ్య ఎలాంటి ఈగోలు లేవన్నారు రాజమౌళి.
బెంగళూరులో నిర్వహించిన ప్రమోషన్స్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్‌లోని రామ్ చరణ్, తారక్, అలియాభట్ అలాగే మూవీ నిర్మాత డీవీవీ దానయ్య, డైరెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరు ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. పునీత్ మరణాన్ని తలుచుకుని ఆయన బాధపడ్డారు. పునీత్ నటించిన చక్రవ్యూహ మూవీ కోసం తారక్ ఒక పాట పాడారు. ఆ పాటను ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్లో పాడుతూ కళ్ల వెంట నీళ్లు తెచ్చుకున్నాడు తారక్.
బెంగళూరు ప్రెస్ మీట్లో ఆర్ఆర్ఆర్ మూవీ హీరో ఎవరంటూ ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. స్వేచ్చ ఆలోచనే ఈ మూవీకి హీరో అని చెప్పాడు రాజమౌళి.