Reduce Belly Fat And Weight Loss: వీటిని ఇలా తాగితే మీరు వద్దన్నా మీ శరీర బరువు 15 రోజుల్లో 2 కేజీలు తగ్గడం ఖాయం!


Reduce Belly Fat And Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా దినచర్యలో భాగంగా కొన్ని అలవాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ డ్రింక్స్ ను కూడా తాగాల్సి ఉంటుంది.
 

Reduce Belly Fat And Weight Loss: బరువు పెరగడం ఎంతో సులభమైనప్పటికీ తగ్గడం మాత్రం కష్టంతో కూడుకున్నదని అందరికీ తెలిసిందే.. ఎందుకంటే అనారోగ్యకరమైన ఆహారాలు, ఆధునిక జీవనశైలి పాటించడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. కానీ బరువు తగ్గే క్రమంలో తప్పకుండా శరీరం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వ్యాయామాలతో పాటు ఆహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలామంది బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినప్పటికీ ఒక కేజీ కూడా బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఇలాంటి వారికోసం మేము ఈరోజు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాం. వీటిని పాటించడం వల్ల ఆరోగ్యంగా సులభంగా మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు.
 

1 /5

బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా రోజుకు మూడు కప్పుల చొప్పున గ్రీన్ టీ ని తాగాల్సి ఉంటుంది. ఇలా గ్రీన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరిగించుకోవచ్చు. చాలామంది గ్రీన్ టీ చేదుగా ఉండటం వల్ల షుగర్ ను వినియోగించి తాగుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ఇలా చేయడం అస్సలు మంచిది కాదు.  

2 /5

బ్లాక్ కాఫీ కూడా శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించి మైండ్ ను యాక్టివ్గా చేసేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇతర చాలా రకాల ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.  

3 /5

బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా యోగాతో పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్లే సులభంగా శరీర బరువు నియంత్రణలోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.  

4 /5

వేగంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా కొంత కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు 25 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శారీరక శ్రమ పెరిగి శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.  

5 /5

బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ డైట్ లో పోషకాలు అధిక పరిమాణంలో లభించే ఆహారాలు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.