Heart attack issues: ఇటీవల కాలంలో చాలా మంది తరచుగా గుండెనొప్పుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. చిన్న వయస్సులోనే హర్ట్ స్ట్రోక్ వల్ల చనిపోతున్నారు. దీని వెనుక ఉన్న కొన్ని ప్రధాన కారణాల గురించి నిపుణులు ఈ విధంగా చెప్తున్నారు.
ఒకప్పుడు గుండె పోటు అనేది పెద్ద వయస్సు వాళ్లలో ఎక్కువగా కన్పించేది .కానీ ఇటీవల దానికి పూర్తిగా భిన్నంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న పిల్లలలో కూడా గుండెపోటులు సంభవిస్తున్నాయి.
మంచి బలవర్థకమైన ఫుడ్ ను తీసుకొక పోవడం, అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవడం వల్ల గుండెపోటులు సంభవిస్తున్నాయని తెలుస్తోంది.
ఒకప్పుడు చాలా మంది శరీరానికి తగిన విధంగా వ్యాయం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటున్నారు. యువత ముఖ్యంగా నడిచేందుకు కానీ శారీరక శ్రమ చేసేందుకు అస్సలు ఇష్టం చూపట్లేదు.
ఇలాంటి వ్యక్తులలో ముఖ్యంగా లావుగా మారిపోయి బెల్లీ ఫ్యాట్ సంభవిస్తుంది. అంతేకాకుండా.. దీని వల్ల శరీరంలో వెళ్లే రక్త నాళాలు కూడా.. అవాంతారాలు ఏర్పడుతున్నాయి.బ్లాక్ లు మూసుకుని పోయి గుండెపోటులు సంభవిస్తున్నాయి.
గుండెపోటులు రాకుడదంటే మంచి బలవర్థకమైన ఫుడ్ ను తింటుఉండాలి. క్రమం తప్పకుండా డైలీ ప్రూట్ జ్యూస్ లను తాగుతుండాలి. ఏ సీజన్ లో దొరికే పండ్లను ఆయా సీజన్ లలో తింటు ఉండాలి. ఆకుకూరల్ని ఎక్కువగా తినాలి.
డైలీ ఒక టైమ్ టెబుల్ పెట్టుకుని వాకింగ్ కు వెళ్లాలి. అంతేకాకుండా.. శరీరానికి శ్రమ ఇవ్వాలి. అదే విధంగా ఎప్పుడు ఒత్తిడికి లోనవ్వకుండా మెదడుకు విశ్రాంతిని ఇచ్చే పనుల్ని చేయాలి.
మెయిన్ గా ఆయిలీ ఫుడ్ లు, జంక్ ఫుడ్ లకు వీలైనంత దూరంగా ఉండాలి.దీని వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అధికంగా బరువు ఉండకుండా చూసుకొవాలి. లైఫ్ స్టైల్ ను ఎంతో జాగ్రత్తగా ఉంటూ డైట్ ను పాటించాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)