Rashmika Mandanna: చీరలో రష్మికా మందన్న.. చెక్కిన శిల్పంలా అందాలు..

Rashmika Mandanna Hot Photos:

రష్మికా మందన్న గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ చీర ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

  • Mar 11, 2024, 13:16 PM IST
1 /5

కిరిక్ పార్టి అనే కన్నడ సినిమా ద్వారా సినీ రంగానికి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మికా మందన్న. నాగశౌర్య హీరోగా చేసిన ఛలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైంది.

2 /5

మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించిన ఈ నటి గీతాగోవిందం చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. విజయ దేవరకొండ తో చేసిన ఈ సినిమా ఆమెకి ఎన్నో ఆఫర్లు తెచ్చిపెట్టింది.  

3 /5

అక్కడి నుంచి దాదాపు అందరూ స్టార్ హీరోలతో జోడి కట్టింది ఈ హీరోయిన్. ఇక ఈమధ్య అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా ఆమెను ఏకంగా పాన్ ఇండియా స్టార్ చేసేసింది.

4 /5

ఆ తరువాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రష్మిక చేసిన యానిమల్ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించి ఆమెకు సౌత్ సైడ్ తో పాటు నార్త్ సైడ్ కూడా ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది.

5 /5

ప్రస్తుతం పుష్ప చిత్రం సీక్వెల్ అలానే యానిమల్ సినిమా సీక్వెల్ ఆఫర్లతో పాటు మరికొన్ని సినిమా చాన్సులతో దూసుకుపోతోంది రష్మిక. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో చీరలో షేర్ చేసే ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. చెక్కిన శిల్పంలా ఈ ఫోటోలలో ఎంతో అందంగా కనిపిస్తూ మైమరిపిస్తుంది ఈ హీరోయిన్.