pushpa 2 hero allu arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో అల్లు అర్జున్ పై ఎన్నికల కోడ్ వయోలేషన్ కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లారు.
అప్పుడు నంద్యాలలో భారీ ర్యాలీలు కూడా నిర్వహించినట్లు తెలుస్తొంది. ఒక వైపు వైసీపీ కార్యకర్తలు, మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
దీంతో ఆ సమయంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ తో పాటు, ప్రజలకు అసౌకర్యం ఏర్పడినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఎన్నికల నియమావళి ఉండగా.. ఇలా చేయడం కూడా ఎన్నికల కోడ్ కు విరుద్దం. దీంతో నంద్యాల పోలీసులు సీరియస్ అయ్యారు.
నటుడు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలపై ఎన్నికల కోడ్ వయోలేషన్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తొంది. తాజాగా, ఈ కేసు విషయంలో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ కేసును కొట్టేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. నవంబరు 6 వరకు తదుపరి చర్యలు తీసుకొవద్దని పోలీసులకు ఆదేశించింది. అంతే కాకుండా..నవంబరు 6 న తీర్పును వెలువరిస్తామని కూడా ధర్మసనం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మాత్రం ఇది బిగ్ రిలీఫ్ గా చెప్పుకొవచ్చు. డిసెంబరు 5 న పుష్ఫ మూవీ అభిమానుల ముందుకు రానుంది. అంతే కాకుండా.. ఇప్పటికే పుష్ప 2 బిజినెస్ 1000 కోట్లు దాటిపోయిందని కూడా టాక్ నడుస్తొంది.