Modi Take charges: దేశ ప్రధానిగా మోదీ మూడోసారి రాష్ట్రపతి భవన్ లో నిన్న (ఆదివారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ, మహారథులు హజరయ్యారు.
దేశంలో మూడోసారి ప్రధానిగా మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా మోదీతోపాటుగా, మరో 72 మంది కేంద్ర మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలు వినూత్నంగా ఫలితాలను ఇచ్చారు. ఎగ్జీట్ పోల్స్ కు కూడా అంచనాలకు విరుద్ధంగా ఫలితాలను ఇచ్చారు. అప్ కీ బార్ చార్ సో పార్ అన్న బీజేపీకి.. కనీసం మ్యాజిక్ ఫిగార్ చేరుకునేంత సంఖ్య కూడా ఇవ్వలేదు. దీంతో మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు మిత్ర పక్ష పార్టీల మీద ఆధార పడాల్సి వచ్చింది.
ముఖ్యంగా చంద్రబాబు, నితీష్ కుమార్ మోదీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్రలను పోషించారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మోదీ తమకు సంపూర్ణ మద్దతు ఉంటే అనేక బిల్లుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పలు సమావేశాల్లో చెప్పారు.
కానీ ఇప్పుడు మాత్రం మిత్ర పక్ష పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినందువల్ల.. కొంత వాళ్లతో మంతనాలు జరిపి, బిల్లుల విషయంలో ఫైనల్ నిర్ణయాలు తీసుకొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ సోమవారం సౌత్ బ్లాక్ లోని పీఎంవో లో బాధ్యతలు చేపట్టారు. మొదటి నుంచి మోదీ తాను.. రైతుల పక్షపాతినని చెప్పుకుంటూ వస్తారు.
రైతులు సంతోషంగా ఉంటేనే.. దేశంలో ఉన్న ప్రజలు కడుపు నిండా అన్నం దొరుకుందని చెబుతుంటారు. ఈ క్రమంలో మోదీ బాధ్యతలు చేపట్టగానే తొలిసారి.. కిసాన్ సమ్మాన్ నిధులు రూ. 20 వేల కోట్లను విడుదల చేస్తు సంతకం చేశారు. దీంతో దాదాపుగా.. 9.3 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందనుంది.
17 వ విడత కింత మోదీ.. రైతుల సంక్షేమం తమ తొలి ప్రాధాన్యతగా.. కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల ఫైల్ పై తొలిసంతకం చేసి అందరి మనస్సులను గెలుచుకున్నారు. రాబోయే రోజుల్లో రైతులకు, వ్యవసాయంపై ఆధారడిన వారి కోసం మరింతగా మేలు చేసే కార్యక్రమాలు చేపడటామని మోదీ అన్నారు.
మరోవైపు ఈ రోజున మోదీ తొలి క్యాబినేట్ సమావేశం జరగనుంది. దీంతో ఎవరికి ఏ శాఖలను కేటాయిస్తారో అనేది మరికొన్ని గంటల్లో క్లారిటీ రానున్నట్లు సమాచారం. మూదీ 2014,2019,2024 మూడు సార్లు పీఎంగా గెలిచి హ్యట్రిక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.