Profitable Agri-small Business Idea: ఊరిలో సొంత భూమి ఉన్నవారికి బంపర్ బిజినెస్‌ ఐడియా.. నెలకు రూ. 2 లక్షల ఆదాయం.. డోంట్ మిస్ ఇట్

Dragon Fruit Farming Business Idea: బిజినెస్‌ అనేది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన కళ. ఒక వ్యాపారాన్ని నిర్మించడం, దానిని విజయవంతం చేయడం అనేది ఒక శిల్పి తన కళాఖండాన్ని తీర్చిదిద్దినట్లు. బిజినెస్ ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడులు అవసరం. చిన్న పెట్టుబడితో కూడా విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌ ఎంతో లాభదాయకమైనది. ఈ బిజినెస్‌ను మీ సొంత పొల్లంలో కూడా ప్రారంభించవచ్చు. ఇంతకీ ఈ బిజినెస్‌ ఏమిటి? ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకోండి ఇలా.. 

1 /10

ఒక బిజినెస్‌ను ప్రారంభించడానికి కోట్లు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. చాలా చిన్న బిజినెస్‌లు కూడా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, క్రమంగా వృద్ధి చెందుతాయి. అలాగే బిజినెస్‌ స్టార్ట్ చేయడానికి చిన్న పొల్లం ఉన్న సరిపోతుంది. 

2 /10

ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వ్యాపారం.  డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందుతోంది. దీనికి కారణం దీనికి ఉన్న అధిక డిమాండ్, తక్కువ నీటి అవసరం,  పోషక విలువలు. చిన్న పొలాల యజమానులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

3 /10

నేటికాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల అవగహాన పెంచుకుంటున్నారు.  ఆరోగ్య ప్రజలలో డ్రాగన్‌ ఫ్రూట్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని జ్యూస్‌లు, స్మూతీలు, సలాడ్‌లు ఇతర వంటకాలలో ఉపయోగిస్తారు. కాబట్టి ఈ వ్యాపారం మీకు బోలెడు లాభాలను తీసుకువస్తుంది.   

4 /10

ఇతర పంటలతో పోలిస్తే, డ్రాగన్‌ ఫ్రూట్‌కు తక్కువ నీరు అవసరం. దీని వల్ల కరువు ప్రాంతాలలో కూడా దీనిని సాగు చేయవచ్చు. ఒకసారి నాటితే డ్రాగన్‌ ఫ్రూట్‌ చెట్టు అనేక సంవత్సరాల వరకు పండ్లను ఇస్తుంది. చిన్న పొలాలలో కూడా దీనిని సాగు చేయవచ్చు.  

5 /10

డ్రాగన్‌ ఫ్రూట్‌కు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల, దీని ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. డ్రాగన్‌ ఫ్రూట్‌లు వివిధ రకాల రంగులు, రుచులలో లభిస్తాయి. ఉదాహరణకు, పింక్, ఎరుపు, తెలుపు, పసుపు రంగుల డ్రాగన్‌ ఫ్రూట్‌లు ఉన్నాయి.

6 /10

మీరు ఎటువంటి డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగు చేయాలని అనుకుంటున్నారు అనేది ముందుగా ప్లాన్‌ చేసుకోండి. అలాగే ఈ డ్రాగన్‌ ఫ్రూట్ సాగు చేసే పద్ధతులు ఎంతో సులభం. ట్రెల్లీస్ పద్థతిలో దీని సాగు చేయవచ్చు. ఈ పద్థతిలో డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలను ఒక నిర్మాణంపై పెంచుతారు. ఇది మొక్కలను బాగా పెరగడానికి ,పండ్లను సేకరించడానికి సులభతరం చేస్తుంది.

7 /10

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు ప్రారంభించడానికి ముందు మీ ప్రాంతంలో డ్రాగన్‌ ఫ్రూట్‌కు డిమాండ్ ఉందో లేదో తెలుసుకోండి. నాణ్యమైన మొక్కలను ఎంచుకోండి.  మొక్కలు, ఎరువులు, నీరు, శ్రమ వంటి వాటికి అవసరమైన పెట్టుబడిని అంచనా వేయండి.

8 /10

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో విజయం సాధించడానికి నీటిని తగిన మోతాదులో అందించండి. ఎరువులను సమయానికి వేయండి. దీంతో పాటు మంచి మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించండి. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు ఒక లాభదాయకమైన వ్యాపారం. కొంచెం కష్టపడితే, మీరు ఈ వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

9 /10

ఈ బిజినెస్ ప్రారంభించడానికి రూ. 10 వేలు పెట్టుబడి సరిపోతుంది. మూడు లేదా నాలుగు ఎకరాలు డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట వేసుకుంటే సంవత్సరానికి రూ. 25 లక్షలు సంపాదించవచ్చు.  

10 /10

 మీ వద్ద పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్‌ తీసుకోవచ్చు. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.