Pradhan Mantri Awas Yojana: మానవుడి ప్రాథమిక అవసరాల్లో నివాసం అనేది అతి ముఖ్యమైనది. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఇళ్లు అనేది ప్రతి పేదవాడి కల. అలాంటి కల ప్రధానమంత్రి ఆవాస్ పథకం ద్వారా సాధ్యమవుతోంది. దీనికి మీరు చేయాల్సిందల్లా కొన్ని పత్రాలు చూసుకోవాల్సి ఉంది.
పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఆవాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని కుటుంబాలకు ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు అందజేస్తారు. ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధి పొందాలంటే కొన్ని పత్రాలు.. అర్హతలు ఉండాలి. అవేంటో తెలుసుకోండి.
ఈ సర్వే ద్వారా లబ్ధిదారుడిని పథకానికి ఎంపిక చేస్తారు. ఈ సర్వేలో పేరు లేని వారు గ్రామ పంచాయతీ కార్యదర్శి, రూరల్ హౌసింగ్ అసిస్టెంట్, పంచాయతీ రోజ్‌గార్ సేవక్ ద్వారా రాబోయే సర్వేలో తమ పేరును నమోదు చేసుకోవాలి.
అర్హతలు: లబ్ధిదారుడి పేరు మీద శాశ్వత ఇల్లు ఉండకూడదు. అతడి నెలవారీ ఆదాయం రూ.15 వేలకు మించకూడదు. లబ్ధిదారుల క్రెడిట్ కార్డు బిల్లు రూ.50 వేలకు మించకూడదు. దరఖాస్తుదారులు ఏ ఇతర పథకం కింద ఇంటి నిర్మాణం పొంది ఉండకూడదు.
విడతలవారీగా: ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు మూడు విడతలుగా రూ.1.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.5 లక్షల వరకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు: లబ్ధిదారులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపర్చాలి. జాబితాలో పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. పీఎంఏవైజీ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌ని సందర్శించి లబ్ధిదారులు తమ పేర్లను పరిశీలించవచ్చు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. వెబ్‌సైట్ తెరిచాక హోమ్ పేజీలోని సిటిజన్ అసెస్‌మెంట్ ఎంపికపై క్లిక్ చేయండి. అక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి. ఆపై మీరు ఈ పథకానికి అర్హులో కాదో అక్కడ తెలుస్తుంది.