Hyderabad Top In OYO Booking: హైదరాబాద్ అంటేనే సాంకేతికపరంగా వేగంగా దూసుకుపోతున్న నగరం. అయితే, హైదరాబాద్ ఓయో బుకింగ్‌లో కూడా దూసుకుపోతుందట. దీనికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి. అయితే, తర్వాతి స్థానంలో కూడా ఏ నగరాలు ఉన్నాయి ట్రావెలోపీడియా 2024 నివేదిక విడుదల చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అత్యాధునిక హంగులతో ఓయో లాడ్జీలు ఉంటాయి. అంతేకాదు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. దేశంలోని ప్రతి ప్రధాన నగరంలో మాత్రమే కాదు. ప్రతి సంధుల్లో కూడా వీటి సేవలు కొనసాగుతున్నాయి.
అయితే, ట్రావెలోపీడియా 2024 ప్రకారం ఈ ప్రముఖ హోటల్ బుకింగ్ యాప్ OYO ఓ నివేధిక విడుదల చేసింది. దీన్ని ప్రకారం ఓయో రూమ్స్ అత్యధికంగా హైదరాబాద్‌లోనే బుక్ అవుతున్నాయట.
హైదరాబాద్ తర్వాత స్థానంలో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా ఉన్నాయి. ఇదిలా ఉండగ పూరీ, వారణాసి, హరిద్వా్‌లు ఎక్కువగా ప్రయాణించే నగరాలని నివేదిక విడుదల చేసింది.
అయితే, ఓయో రూమ్స్ బుకింగ్ తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రలో అత్యధికంగా బుక్ చేస్తున్నారట. ఇవి ఆధునాతనంగా కనిపించడంతోపాటు అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉండటం ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇదికాకుండా కొత్త ఏడాది కూడా దగ్గరపడుతోంది. గ్రాండ్‌గా పార్టీలు నిర్వహించుకోవడానికి కూడా చాలామంది ఎదురు చూస్తుంటారు. దేశ విదేశాల నుంచి నగరాలకు వస్తుంటారు. ఎక్కువ మంది టూరిస్టులు కూడా ఓయో యాప్‌లో సులభంగా బుక్ చేసుకుంటున్నారు.
అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఓయో హోటల్స ప్రమోషన్ కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దీంతో ఎక్కువ శాతం మంచి ఈజీగా ఓయో రూమ్స్ బుక్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
కొన్ని ప్రైవేటు హోటల్స్ ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటారు. వీటి ధరలు భారీగా ఉంటాయి. అందుకే చీప్ అండ్ బెస్ట్ అని ఓయోను ఎక్కువ శాతం మంది ఎంచుకుంటున్నారట.