POCO M7 Pro 5G At Rs @999: క్రిస్మస్ సందర్భంగా ఛార్జర్‌ ధరకే.. POCO M7 Pro 5G మొబైల్‌.. ఏకంగా రూ.13 వేల తగ్గింపు!

POCO M7 Pro 5G Christmas Offer Full Details Here: క్రిస్మస్ సందర్భంగా పోకో బ్రాండ్‌కు సంబంధించిన కొన్ని మొబైల్స్‌ను  కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ తో పాటు అదనంగా అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారా?
 

POCO M7 Pro 5G At Rs @999 In Flipkart Christmas Offer Full Details: క్రిస్మస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో గత రెండు రోజుల నుంచి ఆఫర్ల పండగ ప్రారంభమైంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల పై 30 నుంచి 40% వరకు తగ్గింపుతో ప్రత్యేకమైన సేల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ తగ్గింపుతో పాటు అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి క్రిస్మస్ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఈఎంఐ ఆఫర్స్ కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 

 
1 /6

ముఖ్యంగా కొన్ని మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేకమైన అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే వాటిపై క్రిస్మస్ సందర్భంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ముఖ్యంగా పోకో బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మొబైల్స్ అత్యంత తగ్గింపు దరకే లభిస్తున్నాయి.     

2 /6

ఎప్పటినుంచో మంచి 5g ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ పోకోకు సంబంధించిన కొన్ని మొబైల్‌పై ఫ్లాట్ తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్, బ్యాంక్ ఇలా అనేక డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది.     

3 /6

ఇక గతంలో మార్కెట్లోకి విడుదలైన POCO M7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఎప్పుడు చూడని డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ దాదాపు 21 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా నో కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.     

4 /6

ప్రస్తుతం మార్కెట్లో పోకో కంపెనీ ఈ మొబైల్‌ను రెండు స్టోరేజ్ వేరియన్స్‌తో పాటు మూడు విభిన్న కలర్ ఆప్షన్స్‌తో విక్రయిస్తోంది. మార్కెట్లో దీని ధర MRP రూ.18,999 కాగా.. క్రిస్మస్ సందర్భంగా ఈరోజే కొనుగోలు చేసే వారికి ఏకంగా 21% డిస్కౌంట్తో రూ.14,999కే అందిస్తోంది.     

5 /6

ఇక ఇంత ధర పెట్టి కొనలేం అనేకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్ అందిస్తోంది. దీనిని కొనుగోలు చేసే క్రమంలో కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా మరింత డిస్కౌంట్ పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వినియోగించవచ్చు..   

6 /6

ఇక దీనిపై ఉన్న ఎక్స్చేంజ్ ఆఫర్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ ను కొనుగోలు చేసే క్రమంలో ఏదైనా బ్రాండ్‌కు సంబంధించిన పాత మొబైల్‌ను ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.13 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ చేసే వారికి అదనంగా రూ.1,000 వరకు ప్రత్యేకమైన బోనస్ కూడా లభిస్తోంది. దీంతో ఈ మొబైల్ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోనూ రూ.999 కంటే తక్కువ ధరకే పొందవచ్చు.