PMV Electric Car: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ కార్ల శకం ప్రారంభం కానుంది. నానో కారు లాంటిదే ఇప్పుడు బుల్లి ఎలక్ట్రిక్ కారును ముంబైకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ లాంచ్ చేసింది. అత్యంత చౌకగా లభిస్తున్న అతి బుల్లి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఈ కారు ఇతర వివరాలు తెలుసుకుందాం..
ఇక PMV లుక్ గురించి చెప్పుకుంటే..ఈ కారులో హెడ్‌ల్యాంప్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో ఒక ఎల్ఈడీ లైట్ బార్ ఉంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్లు కాగా, ఈ కారు బరువు 550 కిలోలుంది.
ఇందులో ఒక డిజిటల్ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఎయిర్ కండీషనింగ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్టెన్స్, క్రూజ్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఆన్‌బోర్డ్ నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ యాక్సెస్, స్మార్ట్‌ఫోన్ కనెక్షన్ ఉన్నాయి.
కారుతో పాటు 3కిలోవాట్ ఏసీ ఛార్జర్ కూడా ఉంది. ఈ కారు మోటార్ 13 హెచ్‌పి కాగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 5 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
PMV Electric EaS-E ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చు. పూర్తిగా ఛార్జ్ చేసేందుకు ఓ గంట సమయం పడుతుంది.
PMV Electric EaS-E ఇండియాలో విక్రయిస్తున్న అతి చిన్న ఎలక్ట్రిక్ కారు. ఇందులో ఒకేసారి ఇద్దరు పెద్దవాళ్లు, ఒక పిల్లవాడు కూర్చోవచ్చు. పట్టాణాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ కారు డిజైన్ చేశారు. ఈ కారు పొడవు 2915 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1157 మిల్లీమీటర్లు. ఇక ఎత్తు 1600 మిల్లీమీటర్లు. అంటే మారుతి ఆల్టో కంటే చిన్నదే.
PMV Electric EaS-E ముంబైకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కంపెనీ PMV Electric ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసింది. ఈ కారుకు PMV Electric EaS-E అని నామకరణం చేసింది. ఇది మైక్రోసైజ్ ఎలక్ట్రిక్ కారు. నానో కారు కంటే కాస్త చిన్నది కన్పిస్తోంది. ఇండియాలోని అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే. దీని ధర 4.79 లక్షలు. తొలి పదివేలమందికి ఈ ధర వర్తిస్తుంది. కేవలం 2000 రూపాయలతో కంపెనీ వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవచ్చు. లాంచ్ కంటే ముందే 6 వేల కార్లు బుక్ అయ్యాయి.