PM Kisan Samman Nidhi Status: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ, PM Kisan స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

  • May 14, 2021, 12:14 PM IST

PM Kisan Samman Nidhi Status | అన్నదాతలకు చేయూత అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Scheme). కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. ప్రతి ఏడాది మూడు దఫాలుగా రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. 

1 /5

PM Kisan Samman Nidhi Status | అన్నదాతలకు చేయూత అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Scheme). కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. ప్రతి ఏడాది మూడు దఫాలుగా రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. 

2 /5

PM Kisan Scheme : పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా మూడు దఫాలుగా రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.2000 చొప్పున మొత్తం 6వేల నగదు జమ చేస్తారు. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు రైతుల ఖాతాలకు రూ.2 వేలు జమ చేయనున్నారు. ప్రస్తుతం 8వ విడత రూ.2000 నగదు కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త అందింది.

3 /5

2021లో తొలి విడత చెల్లింపులు నేడు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా లబ్దిదారులైన రైతులకు రూ.19000 కోట్లు విడుదల చేశారు. ఈ ఏడాది పీఎం కిసాన్ పథకంలో భాగంగా అమలు చేస్తున్న కొత్త రూల్స్ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు రూ.2000 అందుతుంది. ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ అవుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

4 /5

పీఎం కిసాన్ పథకం (PM Kisan Samman Nidhi)లో భాగంగా 8వ దఫాలో మొత్తం 9.5 కోట్ల మంది రైతులు లబ్దిదారులుగా ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ పథకంలో లబ్ది పొందాలంటే  సవరించిన నియమాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ఏడాది తొలి దఫా చెల్లింపులు చేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ కసరత్తు పూర్తి చేసింది. నేటి (మే 14) నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కానున్నట్లు తెలుస్తోంది.

5 /5

PM Kisan Samman Nidhi Status | పీఎం కిసాన్ నిధి జమ వివరాలు రైతులు ఇలా తెలుసుకోవచ్చు.  రైతులు http://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవాలి.   పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో Farmer Cornerకు వెళ్లాలి.   ఆ తర్వాత Beneficiary Status మీద క్లిక్ చేయాలి. తమ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే లబ్ధిదారుల ఖాతా వివరాలు తెరమీద కనిపిస్తాయి.