భారత్‌లో త్వరలో Pfizer Covid-19 Vaccine కానీ..

  • Dec 06, 2020, 11:07 AM IST

యూకే ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్‌కు (Pfizer covid-19 Vaccine) ఆమోదముద్ర వేయడంతో మరోవారం నుంచి వారానికి యూకేలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఫైజర్ తెలిపింది. కోవిడ్ వైరస్ పై పోరులో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని కంపెనీ పేర్కొంది.
 

1 /7

అమెరికాకు చెందిన ఫార్మ దిగ్గజం భారత దేశంలో వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 

2 /7

ఈ మేరకు భారత డ్రగ్ రెగ్యులేటర్ అయిన DGCI అంటే Drugs Controller General Of India నుంచి అనుమతి కోసం వేచి చూస్తోంది.  

3 /7

ప్రస్తుతం యూకేతో పాటు బహ్రెయిన్ వాసులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.జ

4 /7

డిసెంబర్ 4వ తేదీని భారత డ్రగ్ కంట్రోలర్ డీజీసిఐ నుంచి అనుమతి కోరుతూ క్లినికల్ ట్రయల్స్ అవసరం లేకుండా చూడాలని కోరింది. భారత ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఇవ్వమని కోరింది.  

5 /7

అయితే భారత దేశంలో ఏ వ్యాక్సిన్ అయినా తప్పకుండా క్లినికల్ ట్రయల్స్ తరువాత అనుమతి పొందుతుంది.. దాంతో ఫైజర్ వ్యాక్సిన్‌కు కూడా ఇదే వర్తిస్తుంది అని అన్నారు.

6 /7

భారత ప్రభుత్వం నిర్ణయాన్ని గౌరవిస్తూ భారత ప్రజల మేలు కోరుతున్నాం అనుమతి కోసం వేచి చూస్తున్నాం అని ఫైజర్ తెలిపింది.  

7 /7

ఆ అనుమతి లభిస్తే భారతీయులకు గొప్పవరంగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సమారు 96 లక్షల మందికి కరోనావైరస్ సోకింది. దాంతో పాటు సెకండ్ వేవ్ కూడా మళ్లీ మొదలైంది.