Pawan Kalyan: కొణిదెల కుటుంబ సంబరం.. చిరంజీవితో పవన్‌ కల్యాణ్‌ భావోద్వేగం

Pawan Kalyan Success  Celebrations In Chiranjeevi House At Hyderabad: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లోని తన అన్న చిరంజీవి ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంట్లో సంబరాలు జరిగాయి. అంతకుముందు తల్లి, అన్నావదినలకు పవన్‌ పాదాభివందనం చేయగా.. సోదరీమణులు దిష్టి తీశారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

1 /12

Pawan Kalyan Chiranjeevi House: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం లభించింది.

2 /12

Pawan Kalyan Chiranjeevi House: గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన పవన్‌ కల్యాణ్‌ ఈసారి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపు

3 /12

Pawan Kalyan Chiranjeevi House: పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీని గెలిపించిన పవన్‌ కల్యాణ్

4 /12

Pawan Kalyan Chiranjeevi House: విజయం అనంతరం తొలిసారి హైదరాబాద్‌లోని తన అన్న చిరంజీవి నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్.

5 /12

Pawan Kalyan Chiranjeevi House: భార్య అన్నాలెజోవా, కుమారుడు అకీరాతో కలిసి చేరుకున్న ఎమ్మెల్యే పవన్‌.

6 /12

Pawan Kalyan Chiranjeevi House: పూల వర్షంతో స్వాగతం పలికిన కొణిదెల కుటుంబసభ్యులు

7 /12

Pawan Kalyan Chiranjeevi House: అనంతరం హారతి తీసిన తల్లి అంజనా దేవి, వదిన సురేఖ, చెల్లెలు

8 /12

Pawan Kalyan Chiranjeevi House: ఆత్మీయ ఆలింగనం చేసుకుని పవన్‌ కుటుంబాన్ని ఆహ్వానించిన రామ్‌ చరణ్‌

9 /12

Pawan Kalyan Chiranjeevi House: అనంతరం పవన్‌ను తల్లి ముద్దాడింది. ఈ సందర్భంగా పవన్‌ తన తల్లి పాదాలకు నమస్కరించాడు.

10 /12

Pawan Kalyan Chiranjeevi House: వీర విజయంతో వచ్చిన తమ్ముడు పవన్‌ను ముద్దాడిన చిరంజీవి. అనంతరం గులాబీ దండ వేశాడు.

11 /12

Pawan Kalyan Chiranjeevi House: ఈ సందర్భంగా చిరంజీవికి పాదాలకు నమస్కరించిన ఎమ్మెల్యే పవన్‌.

12 /12

Pawan Kalyan Chiranjeevi House: చెల్లెలు, అన్నావదినలు, అల్లుళ్లు, పిల్లలతో సహా కేక్‌ కోసిన పవన్‌ కల్యాణ్