Own Daughter Breastfeed To Father: కన్న కూతురు తండ్రికి పాలిస్తున్న ఓ పెయింటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ పెయింటింగ్ వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Own Daughter Breastfeed To Father : చాలా మంది పై ఫోటో చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. కొంత మంది నెగిటివ్ కూడా ఫీలయ్యి ఉంటారు. కానీ దీని వేనుకున్న నిజమెంటో తెలుసుకుంటే ఎమోషనల్ అవుతారు. ఓ కూతురు తన తండ్రికి పాలిస్తున్న ఈ పెయింటింగ్ ఫోటో 30 మిలియన్ల యూరోస్‌కి అమ్ముడుపోయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.258 కోట్లకు .. ఈ పెయింటింగ్ ఫోటో అంత ఎక్కువ రేటుకి అమ్ముడుపోవడానికి కారణం ఏంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఫోటో వెనుక నిజంగా జరిగిన ఒక చారిత్రాత్మక కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని వందల సంవత్సరాల క్రితం యూరప్‌లోని ఒక ప్రాంతంలో సిమున్ అనే వృద్ధుడు ఉండేవాడు.. అతనికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు పెరు.. ఈ సిమున్‌కి తన కూతురు తప్ప ఇంకెవరూ లేరు. ఒక రోజు సిమున్ ఒక చిన్న దొంగతనం చేస్తాడు. ఇలా ఒక చిన్న దొంగతనం చేసినందుకే అప్పటి వాళ్ళ ప్రభుత్వం అతనికి ఏకంగా మరణశిక్షనే విధిస్తుంది.
ఆ మరణశిక్ష కూడా ఎలాంటిదంటే అతన్ని జైల్లో బంధించి, అతనికి తినడానికి.. తాగడానికి ఏమీ ఇవ్వకుండా ఆకలితోనే అతను ఆ జైలు గదిలోనే చనిపోవాలి. ఇదే వాళ్ళు విధించిన ఆ మరణశిక్ష నిబంధన.. సిమన్ కూతురు పెరుకి వాళ్ళ నాన్నని జైల్లో బంధించారని అతనికి తినడానికి ఏమీ ఇవ్వకుండా ఆకలితోనే చనిపోయే వరకు మరణశిక్ష వేశారని ఆమెకి తెలుస్తుంది.
ఈ విషయం తెలియగానే పెరు అక్కడి అధికారుల దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ నాన్న చనిపోయే వరకు చూడడానికి అతను ఉండే జైలు గదిలోకి వెళ్లడానికి అనుమతించమని అక్కడి అధికారుల్ని బ్రతిమిలాడుతుంది. చివరికి ఆ అధికారులు ఆమె బాధని అర్థం చేసుకొని దీనికి ఒప్పుకుంటారు.
కానీ ఒక కండిషన్ పెడతారు. అదేంటంటే ఆమె వాళ్ళ నాన్న వద్దకు వెళ్లేటప్పుడు.. అతనికి తినడానికి, తాగడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకెళ్లకూడదని చెప్తారు. ఈ కండిషన్‌కి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఆమె వాళ్ళ నాన్నని చూడడానికి బాధతో జైలుకి వెళ్తుంది. ఆ జైల్లో ఉండే సెక్యూరిటీ గార్డ్స్ ఆమె వాళ్ళ నాన్నకి ఏమైనా తినడానికి ఆహారపార్థాలను తీసుకొచ్చిందా? అని ఆమెని మొత్తం చెక్ చేసి మరీ లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత పెరు వాళ్ళ నాన్న ఉండే జైలు గదిలోకి వెళుతుంది. వాళ్ళ నాన్న సిమున్ చాలా నీరసంగా బలహీనంగా అయిపోతాడు. చాలా ఆకలి బాధతో ఉంటాడు. వాళ్ల నాన్నని అటువంటి పరిస్థితుల్లో చూసి పెరు తట్టుకోలేక పోయి ఏడుస్తుంది.
వాళ్ల నాన్నకి ఏదైనా తినడానికి ఇవ్వడానికి ఆమె దగ్గర ఏమీ లేకపోవడంతో.. వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది. నాన్న నీవు ఆకలితో చనిపోయే వరకు నిన్ను రోజు కలవడానికి అధికారులు నాకు అనుమతి ఇచ్చారు. నీకు తినడానికి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకురాకూడదని కండిషన్‌ని కూడా పెట్టారని.. అందువల్లే నాన్న నీకు ఏమి తీసుకురాలేకపోయాను.. కానీ నిన్ను ఇటువంటి పరిస్థితుల్లో చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని ఎంతో బాధతో చెబుతుంది.
నువ్వు ఇలా ఆకలితో చనిపోవడం నాకు ఇష్టం లేదని.. నేను నిన్ను చనిపోనివ్వను, తప్పకుండా బ్రతికించుకుంటాను. నీకు తినడానికి ఏదైనా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు.. కానీ బ్రతికించుకోవడానికి నీ ఆకలి బాధని తీర్చడానికి నా వంతుగా ఒకటి చేయాలనుకుంటున్నాను. అందుకోసం నీకు నేను నా పాలిస్తానని పెరు వాళ్ల నాన్నతో అంటుంది.
అప్పుడు సిమన్ ఆశ్చర్యపోతాడు.. నేను ఇలాగే ఆకలితో చనిపోతాను.. నువ్వు ఈ పని చేయవద్దని తన కూతుర్ని వేడుకుంటాడు. కానీ పెరు మాత్రం ఏడుస్తూ వాళ్ల నాన్నని బ్రతిమిలాడుతుంది. చివరికి వాళ్ల నాన్నను ఒప్పుకునేలా చేస్తుంది. ఇక సిమున్‌ను తన కూతురు మాటని కాదనలేక పాలు తాగుతూ ఉంటాడు. ఇలా తన కూతురు రోజు అతన్ని కలవడానికి జైలుకు వచ్చి రహస్యంగా వాళ్ల నాన్నకి పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు ప్రతిరోజు వాళ్ల నాన్నని చూడడానికి వచ్చి తన పాలిచ్చి వెళ్తుంది.
కొన్ని రోజులు గడిచాక ఆ జైలు అధికారులకి ఒక అనుమానం వస్తుంది. అది ఏంటంటే ఈ పాటికి పెరు వాళ్ల నాన్న చనిపోవాలి? అతని కూతురు కూడా ఆయనకి తినడానికి ఎటువంటి ఆహారపరతాన్ని కూడా తీసుకెళ్లడం లేదు. అయినా కూడా అతను ఇంకా బ్రతికున్నాడని అనుమానం వస్తుంది. దీనికి కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలని ఆ జైలు అధికారులు అనుకుంటారు. రోజు మాదిరిగానే పెరు వాళ్ళ నాన్నని చూడడానికి అతని జైలుకదిలోకి వెళ్తుంది. ఆ జైలు అధికారులు అనుమానంతో ఆమెకి తెలియకుండా ఆ గదిలోకి చూస్తారు. అప్పుడు తన కూతురు వాళ్ల నాన్నకి రహస్యంగా పాలిస్తుందని విషయం తెలుసుకొని ఆమెను పట్టుకుంటారు.
ఆమెని బయటకు పిలిచి మీ నాన్నకి తినడానికి తాగడానికి ఏమి ఇవ్వకూడదని కండిషన్ ని పెట్టారు. అయినా కూడా ప్రతిరోజు మీ నాన్నని చూడడానికి వచ్చి రహస్యంగా అతనికి పాలిచ్చి వెళ్తున్నావా అని ఆమెపై కేసు ఫైల్ చేస్తారు. తర్వాత పెరుని వాళ్ల పై అధికారుల వద్దకు తీసుకెళ్తారు. కానీ ఆ పై అధికారులు వాళ్ల నాన్న కోసం ఆమె చేసిన సాహసానికి త్యాగానికి చలించి పోతారు.
పెరు వాళ్ల నాన్న పై ఆమె చూపిన నిస్వార్థం ప్రేమ అని అర్థం చేసుకుంటారు. దీంతో వారిద్దరిని జైలు నుంచి వదిలేస్తారు. ఇలా కూతురు, తండ్రికి సంబంధించిన ఫోటో ఫెంటింగ్ 1741లో రూ.258 కోట్లకు అమ్ముడుపోయింది.