Uric Acid Reduce With Ajwain: యూరిక్ యాసిడ్ (Uric Acid) అధికంగా ఉంటే కిడ్నీల్లో స్టోన్స్, కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే, ఇంటి వంటగదిలో ఉండే వస్తువులతో యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టొచ్చు. మనం దగ్గుతో బాధపడినప్పుడే ఉపయోగించే బామ్మల కాలంనాటి వాము (Ajwain)తో కూడా యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టొచ్చు.
వామును వివిధ వంటల్లో వినియోగిస్తాం. ఇది అజీర్తి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అయితే, వామును డైట్లో చేర్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. ప్యూరీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. వామును డైట్లో చేర్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.
వాములో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నికొటిన్ యాసిడ్ కూడా ఉంటుంది. వాముకు యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే లుటియోలిన్, బీటా సెల్లినిన్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు పరగడుపున వాము నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు. ఒక గ్లాసులో వాము వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఈ నీటిని తీసుకోవాలి. ఇందులో మీరు అల్లం కూడా వేసి తీసుకుంటే మెరుగైన ఫలితాలు కలుగుతాయి.
మీరు యాసిడిటీ, మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వాముతో ఎఫిక్టీవ్ రెమిడీ. ఎందుకంటే వాములో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. వాములో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ గుణాల వల్ల జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టొచ్చు. ఇందులో యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు ఆర్థరైటీస్, కీళ్లనొప్పులకు చెక్ పెడతాయి.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)