Be careful: పాన్ కార్డ్ వివరాలు అప్డేట్ చేయమని ఈ మధ్యకాలంలో కొందరికి మెసేజ్ లు వస్తున్నాయి. అలాంటి మెసేజ్ మీకు వచ్చినట్లయితే వాటిని పై పొరపాటునా కూడా క్లిక్ చేయకండి. ఆ మెసేజ్ ని నమ్మి క్లిక్ చేశారో మీ అకౌంట్స్ ఖాళీ అయిపోతాయి. పాన్ కార్డ్ మోసాలు ఎలా జరుగుతున్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం .
Be careful: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారులు ఫిషింగ్ మోసాల బారిన పడుతున్నారు. మోసగాళ్లు తమ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి వారికి ఫేక్ మెసేజ్ లు పంపుతున్నారు. లేదంటే వారి బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తామని ఈ మెసేజ్ లలో భయపెట్టిస్తున్నారు. మెసేజులలో అనుమానాస్పద లింక్‌లు కూడా ఉంటున్నాయి. అవి సందేహించని వినియోగదారులను స్కామ్ వెబ్‌సైట్‌లకు తీసుకువెళతాయి.
ఫేక్ మెసేజ్ లు నకిలీవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ధృవీకరించింది. ఇండియా పోస్ట్ అలాంటి హెచ్చరికలను పంపించదని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని లేదా ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలను కోరింది.
పాన్ వివరాలను అప్‌డేట్ చేయకుంటే 24 గంటల్లో IPPB ఖాతాలు బ్లాక్ అవుతాయన్నది తప్పు అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్‌లో PIB స్పష్టం చేసింది. ఇండియా పోస్ట్ ఎప్పుడూ అలాంటి సందేశాలను పంపదు.ఇలాంటి ఫిషింగ్ మోసాలకు భయపడకూదని పీఐబీ కోరింది.
ఫిషింగ్ మోసం అంటే ఏమిటీ? ఫిషింగ్ అనేద ఒకరకమైన ఆన్ లైన్ మోసం లాంటిది. మోసగాళ్లు బాధితులను నమ్మించి వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తుంటారు. లేదా హానికరమైన సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేస్తారు.
పాన్ కార్డు వివరాలు అప్ డేట్ చేయనట్లయితే ఐపీపీబీ అకౌంట్ బ్లాక్ అవుతుందని చెబుతూ బెదిరిస్తున్నారు. ఈ మెసేజ్ లు నిజమైనవిగా అనిపిస్తాయి. కానీ అవి ఫిషింగ్ మోసంలో భాగమని గుర్తించాలి. ఫిషింగ్ ద్వారా సైబర్ నేరస్తులు పాస్ వర్డ్ లు , పిన్ నెంబర్, అకౌంట్ నెంబర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని దొంగలిస్తారు.
సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను పాటించాలంటూ ఐపీపీబీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పాస్ వర్డులను తరుచుగా మార్చుకోవాలని కోరింది. ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లను నమ్మకూడదని తెలిపింది. అకౌంట్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయకూడదని సూచించింది. పబ్లిక్ వైఫై వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని కొన్నింటిని హ్యాక్ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. బ్యాంక్ నుంచి వచ్చే సమాచారం నిజమో కాదో క్రాస్ చేసుకోవాలని పిఐబి సూచించింది. ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ లో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.