New Bumper Pension Scheme: మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్‌..

New Bumper Pension Scheme: వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్‌ పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్‌, నిరుపేదలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పెన్షన్‌ పథకం.. ఇలా వివిధ రకాల పెన్షన్‌ పథకాలను అందిస్తోంది. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ ద్వారా కూడా ప్రత్యేకమైన పెన్షన్‌ను అందిస్తోంది.
 

1 /6

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మొదట్లో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెన్షన్‌ను అందించేది. ఆ తర్వాత ప్రైవేటు ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ పెన్షన్‌ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.50 వేలు కూడా అధిక పెన్షన్‌ పొందవచ్చు.    

2 /6

ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ భాగంగా ఇప్పటి వరకు కొన్ని మంది లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఈ పెన్షన్‌ పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆ రూల్స్‌ ఏంటో? అధిక పెన్షన్‌ ఎలా పొందాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.  

3 /6

ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ప్రత్యేకమైన మార్కెట్ లింక్డ్ స్కీమ్‌గా పిలుస్తారు. దీనికి రాబడులు మార్కెట్‌ నిర్ణస్తుందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ స్కీమ్‌లో రెండు రకాల ఫ్లాన్స్‌ ఉంటాయి. ఇందులో మొదటిది టైర్ 1 అయితే.. రెండవది టైర్ 2..     

4 /6

ఈ స్కీమ్‌ ప్రకారం, టైర్ 1లో ఖాతా ఉంటేనే టైర్ 2లో ఖాతాను ఇస్తారు. ఉద్యోగ విరమణకు కొన్ని ఏళ్ల ముందే ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. ఇలా పెడితేనే 60 ఏళ్ల తర్వాత మీ ఖాతాలో జమైన మొత్తం నుంచి 60 శాతం వరకు ఒక్కసారిగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.     

5 /6

ఈ ఖాతాలో జమైన మిగిన 40 శాతం యాన్యుటీగా ఉపయోగించ్చు. అంటే ఈ యాన్యుటీ నుంచే భారీ మొత్తం మొత్తం పెన్షన్‌ లభిస్తుంది. NPS ఖాతాదారుల పెన్షన్‌ అనేది యాన్యుటీపై ఆధారపడి ఉంటుంది.    

6 /6

ఉదాహరణకు 35 సంవత్సరాల వయస్సు కలిగిన వక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు  నెలా రూ. 15,000 పెట్టుబడి చాలు.. 60 ఏళ్ల వరకు దీని వడ్డీ 10 శాతం అయిన దాదాపు  రూ.1,55,68,356 అవుతుంది. ఇలా అన్ని NPS లెక్కలు పోనూ.. ప్రతి నెల పెన్షన్‌ రూ.53 వేలు లభిస్తుంది.