Nepal Earthquake: నేపాల్ భూకంపం తీవ్రత 6.2, భయపెడుతున్న దృశ్యాలు

నేపాల్ నుంచి భయం గొలిపే ఫోటోలు వెలుగుచూస్తున్నాయి. నేపాల్‌లో ఇవాళ సంభవించిన భూకంపం దృశ్యాలివి. కొన్ని పాత ఇళ్లు కూలిపోయిన దృశ్యాలున్నాయి. నేపాల్ భూకంపం ధాటికి ఎంతమంది మరణించారనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 

Nepal Earthquake: నేపాల్ నుంచి భయం గొలిపే ఫోటోలు వెలుగుచూస్తున్నాయి. నేపాల్‌లో ఇవాళ సంభవించిన భూకంపం దృశ్యాలివి. కొన్ని పాత ఇళ్లు కూలిపోయిన దృశ్యాలున్నాయి. నేపాల్ భూకంపం ధాటికి ఎంతమంది మరణించారనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 
 

1 /5

టిబెట్‌కు అనుకుని ఉన్న బఝాంగ్ జిల్లా భూకంపం ప్రభావం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వరకూ కంపించింది. ఇది ఖాట్మండూ నుంచి 458 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేపాల్ పశ్చిమ జిల్లాలు కైలాలీ, కంచన్‌పూర్, లుంబిని వరకూ భూకంపం ప్రభావం ఉంది.

2 /5

నేపాల్‌లోని బఝాంగ్ జిల్లాను భూకంప కేంద్రంగా భావిస్తున్నారు. భూకంపం తొలిసారి ఇక్కడ మద్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు సంభవించింది. ఆ తీవ్రత 5.3 కాగా రెండవసారి ఇదే జిల్లాలోని చైన్‌పూర్‌లో మద్యాహ్నం 3 గంటల 6 నిమిషాలకు సంభవించింది. అప్పుడు తీవ్రత మరింత పెరిగి 6.2గా నమోదైంది

3 /5

పశ్చిమ నేపాల్‌లో మంగళవారం మద్యాహ్నం ఈ భూకంపం సంభవించింది. నేపాల్ జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం ప్రకారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

4 /5

నేపాల్ భూకంపం ధాటికి ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియలేదు. ఇళ్లు, పాత భవంతులు మాత్రం కూలిపోయాయి. ఇళ్లు శిధిలాలుగా మారుతున్న వీడియోలు భయపెడుతున్నాయి. నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

5 /5

ఢిల్లీ ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఇవాళ కాస్సేపటి క్రితం ఒక్కసారిగా భూమి కంపించింది. దాంతో జనం భయాందోళనకు గురయ్యారు. భూకంపం ధాటికి జనం ఇళ్లలోంచి పరుగులు తీశారు.య నేపాల్‌లో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. భూకంపం తీవ్రత ఆ దేశంలో భూమి నుంచి 5 కిలోమీటర్ల లోతువరకూ ఉంది. నేపాల్ భూకంపం ఫోటోలు భయపెడుతున్నాయి.