NBK: బాలయ్య కెరీర్ ‘అఖండ’ ముందు.. ఆ తర్వాత.. దూకుడుతున్న మీదున్న ‘డాకు మహారాజ్‘ సినీ కెరీర్..

NBK: అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు బాలయ్య తన సినిమాల విషయంలో అప్ గ్రేడ్ అయ్యారు. అంతేకాదు అఖండ ముందు వరకు
బాలయ్య వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్ తో కెరీర్ పతనం వైపు ఉండే. కానీ అఖండ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు వరుసగా  హాట్రిక్ విజయాలతో  దూకుడుమీదున్నారు. ఇక బాలకృష్ణ కెరీర్  అఖండ  ముందు అఖండ తర్వాత అనే విధంగా ఉంది.

1 /5

రూలర్ - నందమూరి బాలకృష్ణ హీరోగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. ఈ సినిమా అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.75 కోట్ల బిజినెస్ చేసింది.  

2 /5

  నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రపై చేసిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్  మహానాయకుడు. అందులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను రూ. 70.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడంతో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను అడ్వాన్స్ పద్ధతిలో రిలీజ్ చేసారు. మొత్తంగా తండ్రి జీవితంపై తెరకెక్కిన ఈ సినిమాలు బాలయ్యకు చేదు జ్ఞాపకాన్ని మిగుల్చాయి.

3 /5

జై సింహా - Jai Simha నందమూరి బాలయ్య హీరోగా కే.యస్.రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘జై సింహా’ . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4 /5

పైసా వసూల్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘పైసా వసూల్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 32.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /5

గౌతమిపుత్ర శాతకర్ణి - నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు బాలయ్య కెరీర్ లో మెమరబుల్ మూవీగా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.