Daaku Maharaaj Wrapped Up: నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అంతేకాదు హాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అంతేకాదు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయాలతో ఎన్నడు లేనంత జోష్ బాలయ్యలో కనిపిస్తోంది. అదే ఊపులో బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో ‘డాకూ మహారాజ్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మంగళవారంతో పూర్తి కావడంతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్.
Daaku Maharaaj Wrapped Up: ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా ‘డాకూ మహారాజ్’ మూవీ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇప్పటికే ‘డాకూ మహారాజ్’ టైటిల్ తో పాటు టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నట్టు టీజర్ లో చూపించారు.
మొత్తంగా సంక్రాంతి పండక్కి ‘డాకూ మహారాజ్’గా బాలయ్య బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం గ్యారంటీ అని అందరు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించారు.
నందమూరి నట సింహం బాలకృష్ణ లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకొని చాలా యేళ్ల తర్వాత హీరోగా హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. అంతకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'అఖండ' చిత్రంతో మంచి సక్సెస్ అందుకొని కథానాయకుడిగా గోడకు గొట్టిన బంతిలా బ్యాక్ బౌన్స్ అయ్యారు.
అంతేకాదు తెలుగులో సీనియర్ టాప్ హీరోల్లో ఈ రేంజ్ లో హాట్రిక్ హిట్స్ అందుకున్న వారు ఎవరు లేరు అది కూడా 60 ప్లస్ ఏజ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న హీరోగా బాలయ్య రికార్డు క్రియేట్ చేసారు.
అఖండ 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాల్లో బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రల్లో నటించాడు.సీనియర్ హీరోల్లో వరుసగా ఎవరు మూడు రూ. 100 కోట్ల గ్రాస్.. రూ. 70 కోట్ల షేర్ అందుకున్న హీరోలు ఎవరు లేరు. తన తరం హీరోల్లో ఈ రికార్డు అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా ఒక్క మగాడుగా నిలిచారు.
మొత్తంగా ‘డాకూ మహారాజ్’గా మరోసారి సంక్రాంతి బరిలో దిగుతున్నాడు బాలయ్య. ఈ సినిమాతో డబుల్ హాట్రిక్ కు నడుం బిగిస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ. బాబీ దేవోల్ ఈ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేస్తున్నాడు. తెలుగులో రిలీజ్ కాబోతున్నబాబీ దేవోల్ కు ఫస్ట్ మూవీ అని చెప్పాలి.