Nayanthara: నయనతార ఫ్యామిలీ టూర్ ఫోటోలు.. ఆ ఒక్క ఫోటో మరింత హైలెట్..!

Nayanthara Family Tour: తమిళంలోనే కాదు తెలుగులో కూడా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. ఇక పెళ్లయిన తర్వాత కూడా ఈ హీరోయిన్.. తన ఫ్యామిలీ ఫోటోల ద్వారా ఇంస్టాగ్రామ్ లో తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో నయనతార తన ఫ్యామిలీ టూర్ ఫోటోలు షేర్ చేసి మరోసారి అభిమానులను ఫిదా చేసింది.

1 /6

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి.. సినీ ప్రేక్షకులకు సరికొత్తగా చెప్పగలిగేది ఏమీ లేదు. తన నటనతో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. ముఖ్యంగా తమిళంలో ఈమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.  

2 /6

కాగా గజినీ, చంద్రముఖి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించింది ఈ హీరోయిన్. ఇక ఆ తర్వాత వరసగా తెలుగులోనే అందరూ స్టార్ హీరోలతోనూ నటించింది. ముఖ్యంగా బాలకృష్ణతో నయనతార చేసిన సింహా సినిమా సెన్సేషనల్ విజయం సాధించింది.  

3 /6

ఈ మధ్యనే బాలీవుడ్ కి సైతం తన ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా షారుక్ ఖాన్ తో నటించి.. హిందీలో మొదటి చిత్రం జవాన్ తోనే మంచి విజయం అందుకుంది. ఈ క్రమంలో నయనతార కి సౌత్ ఇండియా నుంచే కాకుండా నార్త్ ఇండియా నుంచి కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయని వినికిడి.  

4 /6

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి బిజీగా ఉన్న నయనతార.. ఇప్పుడు మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తోంది. ఇందుకు ముఖ్య కారణం ఈ భామ ఎక్కువగా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం.  

5 /6

నయనతార కి సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరితో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని.. మధ్య మధ్యలో విరామం తీసుకుంటుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో తన భర్త విగ్నేష్ శివన్‌‌.. అలానే తన ఇద్దరు పిల్లలతో పారిస్ టూర్ కి వెళ్ళింది నయనతార.  

6 /6

ఈ టూర్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలులో ముఖ్యంగా నయనతార తన పిల్లల్ని ఎత్తుకొని తీసుకున్న ఫోటోలు హైలెట్గా నిలుస్తున్నాయి.