Nayantara: సన్ ఫ్లవర్ శారీలో నయనతార అందాలు.. ‘లవ్ థిస్ ఫ్లవర్’ అనేసిన విజ్ఞేశ్ శివన్

Nayantara Photo Gallery: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. తాజాగా సన్ ఫ్లవర్ శారీలో నయనతార ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

  • Feb 21, 2024, 20:09 PM IST
1 /6

చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ నయనతార. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది.

2 /6

కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ రంగంలో ఉన్న నయనతారా అని చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి అవకాశం ఇచ్చాడు. 

3 /6

ఆ తరువాత మలయాళం లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో సూపర్ హిట్లు అందుకుంది ఈ హీరోయిన్.

4 /6

తర్వాత తమిళంలో 'అయ్య', 'చంద్రముఖి', 'గజిని' వంటి సినిమాల్లో నటించి అక్కడ తనకంటూ విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది.

5 /6

తెలుగులో సైతం ఈమె చేసిన లక్ష్మీ, తులసి సినిమాలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా ఈ హీరోయిన్ బాపు చిత్రం 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

6 /6

ఈ నేపథ్యంలో నయనతార చీర ఫోటోలు ఆమె భర్త విగ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చెయ్యగా అవి తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలు షేర్ చేసి లవ్ విత్ దిస్ ఫ్లవర్ అని క్యాప్షన్ కూడా పెట్టేశారు ఆమె భర్త.