Natural Home Remedies To Keep Snakes Away: పాములు ఎంత విషపూరీతమైనవో అందరికీ తెలిసిందే..అడవుల్లో ఆహార కోరత కారణంగా జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అడవి పరిసర ప్రాంతాల్లో సంచార ప్రభావం రోజురోజుకు పెరిగిపోయింది. పాములు మన పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. కాబట్టి సంచారం చేసే క్రమంలో వాటిని చంపడానికి బదులుగా కొన్ని సహజమైన చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల మీ చుట్టు పక్కన పరిసర ప్రాంతాల్లో పాములు రాకుండా ఉంటాయి.
ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో నివసించేవారి ఇళ్లలోకి పాములు తరచుగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలా మంది వీటి కాటు బారిన పడి కూడా చని పోతున్నారు. అయితే పాములు రాకుండా ఉండడానికి ఈ సహజమైన చిట్కాలు పాటించండి.
తరచుగా ఇంట్లోకి పాములు వస్తున్నవారు తప్పకుండా ఇంటి చుట్టు చిన్న చిన్న వేప మొక్కలను నాటు కోవాల్సి ఉంటుంది. ఇవి చెదు వాసనను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ మొక్కలను దాటుకుని ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.
వేప మొక్కలు నాటడానికి చోటు లేని వారు ప్రతి నెల వేప ఆకులను తలుపులు, కిటికీల దగ్గర చల్లుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి.
అలాగే పాములు రాకుండా ఉండడానికి గంధపు చెక్క మొక్కలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఇంటి చుట్టు నాటుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా దీని నుంచి వచ్చే వాసనకు పాలు దూరంగా వెళ్తాయి.
ఎర్ర మిరపకాయ పొడిని నీటిలో కలిపి పాముల ప్రభావిత ప్రాతాల్లో చల్లడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ ద్రావణం ఇతర జంతువులకు హాని కలిగించే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఇంటి చుట్టూ నవధాన్యాలు మొక్కలు నాటడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. ఈ మొక్కల నుంచి వచ్చే వాసన పాములను తరిమికొట్టేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
మరువము మొక్కలు కూడా పాములను తరిమికొట్టేందుకు సహాయపడతాయి. ఇందులో పాముల వికర్శన శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఇంటి చుట్టు వీటిని నాటడం వల్ల పాములు రాకుండా ఉంటాయి.