Nagarjuna On Naga Chaitanya Shobitha Wedding: నాగ చైతన్య, శోభితల వివాహాం అతిత్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య తండ్రి, హీరో నాగార్జున వీరి వివాహాంపై ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నాగచైతన్య శోభితల వివాహం డిసెంబర్ 4న జరగనుందని తెలుసు. ఇటీవలె వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా నెట్టింట వైరల్ అయింది. ఆ పెళ్లిపత్రికలో శోభిత పేరు 'లక్ష్మి శోభిత' అని ఉంది.
అయితే, అక్కినేని నాగార్జున వీరి పెళ్లిపై ఓ ప్రకటన చేశారు. వాళ్లిద్దరి కోరిక మేరకు కేవలం సింపుల్‌గానే పెళ్లి జరగనుంది. అది కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే డిసెంబర్ 4 జరగనుందని ప్రకటించారు.
నాగచైతన్య శోభితలు కూడా సింపుల్‌గా వివాహాం జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి కేవలం 400 మంది బంధువులు, సినిమా ఇండస్ట్రీ, సన్నిహితుల నడుమ జరగనుందని, వారిని మాత్రమే ఆహ్వానించామని ప్రకటించారు.
నాగచైతన్య శోభితలు సింపుల్ వెడ్డింగ్ కోరుకోవడంతో పెళ్లి ఏర్పాట్లు కూడా వారికే వదిలేశాను, నాకు కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పారు. ఇదిలా ఉండగా పెళ్లిరోజు శోభిత కాంజీవరం సిల్క్ చీరను ధరించనుంది. తన తల్లితోపాటు ఈ సంప్రదాయమైన చీరను ఎంపిక చేసుకుంది.
వీటితోపాటు పొందూరులో నేసిన ఖాదీ చీర చైతన్య డ్రెస్‌తో మ్యాచ్ అయ్యే విధంగా ధరించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కూడా నెట్టింటా వైరల్ అయింది. అయితే, పెళ్లికి ముందు శోభిత చేసిన కొన్ని ఫోటోషూట్లు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇక నాగచైతన్యకు ఇది రెండో వివాహం. మొదట హిరోయిన్ సమంత రూత్ ప్రభును 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.