Natural Tips For Belly Fat: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. బెల్లీ ఫ్యాట్‌ వెన్నలాగా కరిగిపోతది..!

Ways To Lose Belly Fat: ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా  చాలా మంది జంక్‌ ఫూడ్స్‌కు, అతిగా వేయించి పదార్థాలు, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తినడానికి ఇష్టపడుతున్నారు. దీని కారణంగా బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
 

Ways To Lose Belly Fat:  కాలం మారడంతో పాటు మన జీవనశైలి కూడా చాలా మారిపోయింది. అంతేకాకుండా మన ఆహారపు అలవాట్లు కూడా చాలా దిగజారిపోయాయి. పూర్వం మనం ఇంట్లో తయారు చేసుకున్న పోషక ఆహారాలను తినేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో చాలా మంది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, షవర్మాలు వంటి అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తింటున్నారు. ఈ ఆహారాలలో చక్కెర, కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండి పోషకాలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఊబకాయం, గ్యాస్‌, బెల్లీ ఫ్యాట్‌, అసిడిటీ, అధిక బరువు వంటి వివిధ సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ ప్రతిఒక్కరిని వేధించే సమస్యగా మారింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు ఈ టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. 
 

1 /9

మీ శరీర బరువు పెరుగుతూ ఉంటే అది ఊబకాయానికి దారితీస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.  

2 /9

అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మీరు వెంటనే ఈ చిన్న చిన్న టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.   

3 /9

గంటల తరబడి కుర్చీలో కూర్చోవద్దు. ప్రతి అరగంటకో లేదా గంటకో లేచి, కొంచెం నడవండి లేదా మీ స్థానంలోనే శరీరాన్ని స్ట్రెచ్ చేయండి.   

4 /9

ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  

5 /9

ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటు నడవండి. నడక వల్ల కేలరీలు కరిగి, బరువు తగ్గుతారు.  

6 /9

లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కండి. ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్, తొడల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.  

7 /9

వ్యాయామంతో పాటు ఆహారంలో కొన్ని పోషకరమైన పదార్థాలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయవచ్చు.   

8 /9

ప్లాంక్స్, సిట్ అప్స్ వంటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి.  

9 /9

చియా గింజలు, పుదీనా టీ, యాపిల్ సైడర్‌ వెనిగర్‌ జ్యూస్‌లు, నిమ్మకాయ రసం వంటి ఆహారం పానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది.