Moto G73 5G Launch: మోటోరోలా నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ Moto G73 5G ఇండియాలో లాంచ్ అయింది. ఇది జి72కు అప్‌డేటెడ్ వెర్షన్. ఇందులో చాలా అత్యద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఫోన్‌లో 6.5 ఇంచెస్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ప్రత్యేక ఆకర్షణలు. భారతీయ మార్కెట్‌లో ఈ ఫోన్ ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉంది. Moto G73 5G ధర, ఫీచర్ల గురించి పరిశీలిద్దాం..
Moto G73 5G బ్యాంక్ ఆఫర్ Moto G73 5G కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ మార్చ్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
Moto G73 5G ప్రత్యేకతలు Moto G73 5Gలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్, 6.5 ఇంచెస్ ఎల్‌సిడి డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫోన్ 8జీబి ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 930తో పనిచేస్తుంది. ఇందులో మైక్రో ఎస్‌డి స్లాట్ ఉంటుంది. దీంతో స్టోరేజ్‌ను 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు.
Moto G73 5G కెమేరా Moto G73 5Gలో 5 హోల్ కట్‌అవుట్ ఉంటుంది. వెనుక వైపు డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటుంది.
Moto G73 5G బ్యాటరీ Moto G73 5Gలో 30 వాట్స్ ఫాస్ట్‌ఛార్జర్ సపోర్ట్‌తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని బరువు కేవలం 181 గ్రాములే. పవర్ బటన్, ఫేస్ అన్‌లాక్, వాటర్ రెసిస్టెన్స్ వంటి అదనపు ప్రత్యేకతలున్నాయి.
Moto G73 5G ధర ఇండియాలో Moto G73 5G స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర 18,999 రూపాయలు. మోటోరోలా కొనుగోలుదారులకు 2000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. అంటే ఈ ఫోన్ ధర 16,999 రూపాయలవుతుంది.