Mothers Day Special: బాలీవుడ్‌లో స‌త్తా చూపెట్టిన హీరోయిన్స్ కుమారులు వీళ్లే..

Mothers Day Special: ప్ర‌తి సంవ‌త్స‌రం మే రెండ‌వ ఆదివారాన్ని మ‌ద‌ర్స్ డేగా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రుపుకుంటున్నారు. అయితే సినీ ఇండ‌స్ట్రీలో ఎపుడు హీరోల వార‌సులే హీరోలుగా స‌త్తా చూపెడుతూ వ‌స్తున్నారు. ఇక కొంత మంది హీరోయిన్స్ కుమారులు కూడా క‌థానాయకులుగా స‌త్తా చూపెడుతున్నారు.

1 /6

  ర‌ణ్‌బీర్ క‌పూర్ ఒక‌ప్ప‌టి బాలీవుడ్ అగ్ర హీరో, హీరోయిన్లుగా స‌త్తా చూపెట్టిన రిషీ కపూర్, నీతూ క‌పూర్‌ల ముద్దుల త‌న‌యుడు. ఇత‌ను బాలీవుడ్ టాప్ స్టార్‌గా రాణించాడు.  

2 /6

అమితాబ్ బ‌చ్చ‌న్, జ‌యా బ‌చ్చ‌న్‌ల ముద్దుల కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్. ఈమె త‌ల్లి జ‌యా బ‌చ్చ‌న్ ఒక‌పుడు బాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే క‌దా.

3 /6

బాలీవుడ్ బ్యాడ్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఒక‌ప్ప‌టి బాలీవుడ్ అగ్ర హీరో సంజ‌య్ ద‌త్.. త‌ల్లి న‌ర్గీస్ ద‌త్ ఒక‌ప్ప‌టి బాలీవుడ్ నెంబ‌ర్ హీరోయిన్. అటు తండ్రి సునీల్ ద‌త్.. బాలీవుడ్‌లో మొద‌టి త‌రం యాక్ష‌న్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

4 /6

  ష‌ర్మిలా ఠాకూర్.. బాలీవుడ్ మొద‌టి త‌రంలో అందాల క‌థానాయిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కుమారుడు సైఫ్ అలీ  ఖాన్ బాలీవుడ్ న‌టుడిగా స‌త్తా చూపెడుతున్నాడు.

5 /6

  వైజ‌యంతి మాల బాలీ రీసెంట్‌గా కేంద్రం నుంచి ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్నారు. ఈమె త‌న‌యుడు సుచీంద్ర బాలీ త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో హీరోగా అడుగుపెట్టి స‌త్తా చూపెట్ట‌లేక‌పోయాడు.

6 /6

బాలీవుడ్ అగ్ర క‌థానాయిక డింపుల్ క‌పాడియా చెల్లెలు సింపుల్ కపాడియా హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఈమె కుమారుడు క‌ర‌ణ్ క‌పాడియా హీరోగా బాలీవుడ్‌లో ఇపుడిపుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు.