Death Prohibited Here: ఈ ఐదు పట్టణాల్లో మరణం నిషేధం, శ్మశానం లేని ఊర్లు ఇవే

Death Prohibited Here: మనిషి సహా భూమ్మీద ఉండే ప్రాణులన్నింటికీ ఎప్పుడు మరణం ఉంటుందో ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే మృత్యువు భగవంతుని చేతుల్లో ఉంది. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో అలా జరగనివ్వరు. ఈ ప్రాంతాల్లో మరణం అనేది చట్ట విరుద్ధం. అంటే ఈ 5 ప్రదేశాల్లో చావడం నిషేధం. ఆశ్చర్యంగా ఉందా..కానీ ముమ్మాటికీ నిజమిది

Death Prohibited Here: ప్రపంచంలోని ఐదు ప్రాంతాల్లో చావకూడదు. ఆయా ప్రాంతాల్లో మరణం సంభవిస్తే శిక్ష ఉంటుంది. ఆ ఐదు ప్రాంతాలేవో చూద్దాం
 

1 /5

Cugnaux France ఇది ఫ్రాన్స్ దేశంలోని ఓ నగరం. ఇక్కడ కూడా మరణం నిషేధం. ఎవరైనా మరణిస్తే ఖననం చేయడానికి వీల్లేదు. వేరే ప్రాంతానికి తీసుకెళ్లాల్సిందే. 

2 /5

Longyearbyen-Norway నార్వేలోని స్వాల్ బోర్డ్ ద్వీపంలోని ప్రముఖ నగరమిది. ఇక్కడ నో డెత్ పాలసీ అమల్లో ఉంది. ఇదేదో మారమూల ప్రాంతమని కాదు. ఇక్కడి అతి శీతల ఉష్ణోగ్రత ఇందుకు కారణం. ఇక్కడెప్పుడూ మైనస్ టెంపరేచర్ ఉంటుంది. దాంతో మృతదేహాలు ఎప్పటికీ డీ కంపోజ్ కావు. అందుే 1950 తరువాత ఈ నగరంలో శ్మశానం క్లోజ్ అయింది. మరణం నిషేధమైంది.

3 /5

Itsukushima Japan ఈ ప్రాంతం శింతో మతానికి పవిత్రమైంది. 1868 వరకు ఇక్కడ జనన మరణాలకు అనుమతి లేదు. ఇప్పటికీ ఈ పట్టణంలో ఎలాంటి ఆసుపత్రి గానీ, శ్మశానం గానీ లేదు. 

4 /5

Selia, Italy ఇటలీకు చెందిన ఈ హిల్ స్టేషన్. ఈ పట్టణ పరిధిలో ఎవరూ వ్యాధిగ్రస్తులు కాకూడదు. ఈ పట్టణంలో జనాభా తగ్గుతుండటంతో నియంత్రించేందుకు మరణంపై నిషేధం విధించారు. ఆరోగ్యం గురించి సరైన శ్రద్ధ తీసుకోలేక అనారోగ్యానికి గురైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

5 /5

Le lavandou France ఫ్రాన్స్ దేశంలోని ఈ పట్టణంలో 2000 సంవత్సరంలో మరణంపై నిషేధం విధించారు. పర్యావరణ నిబంధనల కారణంగా కొత్త శ్మశానం అనుమతి లేకపోవడంతో ఈ ఆదేసాలు జారీ అయ్యాయి.