Meenakshi Chaudhary: బిస్కెట్ రంగులో మెరిసిన మీనాక్షి చౌదరి.. ఫోటోలు చూస్తే ఫిదా..

Meenakshi Chaudhary Instagram pics: మీనాక్షి చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పిన తక్కువే. అత్యంత తక్కువ కాలంలోనే ఎక్కువ మంది.. అభిమానులను సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

1 /5

మీనాక్షి చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్. సుశాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై పర్వాలేదు అనిపించుకుంది.  

2 /5

ఇక వెంటనే రవితేజతో ఖిలాది సినిమాలో కనిపించి మెప్పించింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. కాగా ఈ సినిమా అయిన తరువాత హిట్ 2 లో కనిపించి.. మంచి విజయం అందుకుంది మీనాక్షి చౌదరి. ఆ తరువాత నుంచి ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. 

3 /5

ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో.. మహేష్ బాబు హీరోగా చేసిన.. గుంటూరు కారం సినిమాలో సైతం కనిపించింది. అయితే ఈ చిత్రం మీనాక్షి చౌదరికి.. ఎటువంటి లాభం కలిగించలేదు. ఈ సినిమాలో కేవలం కొద్ది నిమిషాల పాటు మాత్రమే కనిపించింది…

4 /5

కాగా ప్రస్తుతం విజయ్ హీరోగా చేస్తున్న గోట్ సినిమాలో.. అలానే దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న లక్కీ భాస్కర్ చిత్రంలో కనిపించి మెప్పిచనుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ హీరోయిన్.   

5 /5

ఈ క్రమంలో మీనాక్షి చౌదరి ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకత్తుకుంటున్నాయి. ఈ ఫోటోలలో మీనాక్షి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది.