Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీలో మహేష్ బాబు సందడి

Sania Mirza Farewell Party: సానియా మీర్జా హైదరాబాద్‌లో ఏ స్టేడియంలోనైతే కెరీర్ ఆరంభించారో.. అదే స్టేడియంలో తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్‌కి గుడ్‌బై చెప్పారు. సానియా మీర్జా ఆహ్వానం మేరకు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది సానియా మీర్జాకు ఫేర్‌వెల్ ఇచ్చేందుకు తరలి వచ్చారు. 

Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్‌కి హాజరైన ప్రముఖులు ఆమెను ఆద్యంతం ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. ఒక రకంగా క్రీడా రంగంలో సొంత గడ్డపై అతికొద్ది మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఇది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఇతర క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు స్టేడియంలో చప్పట్ల మధ్య సానియా మీర్జాకు గ్రాండ్ ఫేర్‌వెల్ ఇచ్చారు. 

1 /4

Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్ ముగిసిన అనంతరం సిటీలో జరిగిన ఫేర్‌వెల్ పార్టీలోనూ ప్రముఖులు సందడి చేశారు. సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీకి హాజరైన మహేష్ బాబుతో ఏ.ఆర్. రెహ్మాన్ సెల్ఫీ తీసుకుంటున్న మూమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2 /4

Mahesh Babu at Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యాడు. మహేష్ బాబు రాకతో సానియా మీర్డా ఫేర్‌వెల్ పార్టీలో భారీ సందడి కనిపించింది.

3 /4

Mahesh Babu at Sania Mirza Farewell Party: మహేష్ బాబుతో పాటు ఆయన సతీమణి, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ కూడా ఈ పార్టీకి రావడంతో ఈ పార్టీ మరింత అందంగా, ఆకట్టుకునేలా కనిపించింది.  

4 /4

Mahesh Babu at Sania Mirza Farewell Party: మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ, సానియా మీర్జా అండ్ ఫ్యామిలీ గతంలోనూ పలు సందర్భాల్లో సరదాగా కలిసి పార్టీలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రెండు కుటుంబాలను ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా చెబుతుంటారు.