గాంధీజీ గొప్ప బ్యాట్స్ మెన్.. లా చదివే సమయంలో క్రికెట్ కు సెలవు చెప్పారు

  • Oct 02, 2020, 18:02 PM IST


ప్రపంచం మొత్తం జాతిపిత మహాత్మా గాంధి 151వ జయంతిని సెలబ్రేట్ చేస్తోంది. ఈ తరుణం క్రికెట్ ను ప్రేమించిన బాపుగారిని మీకు పరిచయం చేస్తాం.    

1 /5

మహాత్మా గాంధీ చూడటానికి బక్కపల్చగా ఉన్నా గట్టిగా ఉండేవారు. స్కూల్ టైమ్ లో ప్రిన్సిపల్ తప్పకుండా గేమ్స్ ఆడాలి అనే రూల్ పెట్టారు. దీంతో క్రికెట్ ఆడటం ప్రారంభించారు.  మంచి బౌలర్ అవడంతో వరుసగా వికెట్లు తీసేవారు.  అయితే ఆయన బ్యాటింగ్ కూడా బాగా చేసేవారట. అయితన లా చదివే సమయం నుంచి క్రికెట్ కు దూరం అయ్యారు.

2 /5

భారత దేశంలో రంజీ ట్రోఫి  మ్యాచులు దేశవాళి క్రికెట్ లో మంచి ఫార్మాట్ గా గుర్తింపు తెచ్చుకుంది. రంజీత్ సింగ్ పేరుపై ఇలా రంజీ ట్రోఫి నిర్వహిస్తారు. లండన్ లో చదువుకోడానికి వెళ్లిన రంజిత్ సింగ్ బ్రిటిష్ వారి తరపున క్రికెట్ ఆడాడు. బాపు, రంజిత్ రూమ్ మేట్స్ కూడా.

3 /5

కులం, మతాలు అనేవి ట్యాలెంట్ కు ప్రాతిపదికలు కావు అని నమ్మేవాడు కాదు బాపు .అందుకే వాటి ఆధారంగా క్రీడల్లో ఎంపిక జరగకూడదలు అనుకునే వారు.

4 /5

బ్రిటిష్ వారు భారత దేశాన్ని మతాల ఆధారంగా విభజించారు. క్రికెట్ లో కూడా హిందూ క్లబ్, పార్షీ ఎలెవన్, ముస్లిం క్లబ్, యూరోపియ్ ఎలెవన్ అని టీమ్స్ ఏర్పాటు చేసి టోర్నమెంట్ నిర్వహించాలని భావించారు. కానీ బాపూ గారు దానిని ఖండించారు. చివరికి టోర్నమెంట్ రద్దయింది.

5 /5

1933లో క్రికెట్ ఆడటానికి భారత్ చేరుకున్న ఇంగ్లాండ్ టీమ్ సంతకాలతో పాటు మహాత్మగాంధీగారి సంతకం ఉన్న ఆటోగ్రాఫ్ బుక్