Lunar Eclipse 2023: ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14తో ముగిసింది. ఇక మిగిలింది చివరి చంద్ర గ్రహణం. అక్టోబర్ 28న చివరి చంద్ర గ్రహణం ఉంది. శరద్ పౌర్ణిమ రోజు రాత్రి చంద్ర గ్రహణం ఇండియాలో కన్పించనుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడినా కొన్ని రాశులకు మాత్రం అత్యంత లాభదాయకం కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
చంద్ర గ్రహణం సమయం అక్టోబర్ 28న ఈ ఏడాది అంటే 2023లో చివరి చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 28 రాత్రి 11.32 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 3 గంటల 56 నిమిషాలకు పూర్తవతుంది. ఇండియా సహా ఇతర దేశాల్లో చంద్ర గ్రహణం కన్పించనుంది.
వృశ్చిక రాశి వృశ్చిక రాశి జాతకులకు చంద్ర గ్రహణం లాభదాయకం కానుంది. ఊహించని చోటి నుంచి ధనలాభం ఉంటుంది. అప్పుల్నించి ఉపశమనం లభిస్తుంది. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి.
ధనస్సు రాశి అక్టోబర్ 28వ తేదీన చంద్ర గ్రహణం కారణంగా ధనస్సు రాశి జాతకులకు అత్యధిక ప్రయోజనం కలగనుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు ఊహించని లాభాలు కలగవచ్చు.
మిధున రాశి చంద్ర గ్రహణం మిధున రాశిపై విశేషమైన ప్రభావం చూపించనుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు లాభం చేకూర్చనుంది. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందడంతో ఆర్ధికంగా ఇబ్బందులుండవు.
వృషభ రాశి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృషభ రాశి జాతకులకు చంద్ర గ్రహణం లాభాలు తెచ్చిపెట్టనుంది. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. జీవితంలో గోల్డెన్ డేస్ ప్రారంభం కావచ్చు.