LPG Gas Cylinder Price Hike: చివరి నెల మొదటి రోజు సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. రూ.16 గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో వరుసగా మరోసారి గ్యాస్ ధరలను పెంచినట్లయింది.. దీంతో డిసెంబర్ 1వ తేదీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ నగరాలవారీగా ఎలా ఉన్నాయో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రతినెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మొదటి రోజున ఎల్పీజీ, ఆయిల్ ధరల సవరణ చేస్తాయి. ఈరోజు డిసెంబర్ 1వ తేదీ కూడా గ్యాస్ ధరల సవరణ చేశాయి. 19 కేజీ సిలిండర్ ధరలను రూ.16 పెంచాయి. ఇది ఈరోజు నుంచే అమలు అవుతుంది.
అయితే, కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచాయి. కానీ, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల నేపథ్యంలో మెట్రో సిటీలు అయిన ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరతో ప్రస్తుతం రూ.1818 చేరింది.
గత నెలలో 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1802 ఉన్నది. ముంబైలో రూ.1771 చేరింది. చెన్నైలో రూ.1980, కాగా కోల్‌కత్తాలో రూ.1964 కు 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు చేరుకున్నాయి.
ఈ ధరలు వరుసగా ఆరోసారి పెరిగాయి. జూలై నుంచి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆగస్టు నెల నుంచి స్థిరంగా ఉంచాయి.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఆయా ప్రాంతాల పన్నుల ఆధారంగా రూ.900 లోపు ఉన్నాయి. ఇవి కాకుండా ఉజ్వల పథకం కింద రూ.500 కంటే తక్కువ ధరలో గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 కే గ్యాస్ సిలిండర్ అర్హులైన కొంతమందికి అందిస్తున్నారు.