Low Investment Business Idea: సరికొత్త బిజినెస్‌ ఐడియా.. ఎలాంటి శ్రమ లేకుండా నెలకు రూ. 50 వేల ఆదాయం..

Home Made Snacks Small Business Idea: ఆహార వ్యాపారం ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందింది. స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్‌లు, కేటరింగ్, బేకరీలు, ఆన్‌లైన్ ఆహారం డెలివరీ వంటి అనేక రకాల ఆహార వ్యాపారాలు ఉన్నాయి. దీనికి కారణం ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని తయారు చేయవచ్చు. పండుగలు, కార్యక్రమాల సమయంలో ఆదాయం పెరుగుతుంది. అయితే మీరు కూడా ఏదైనా ఫూడ్‌ బిజినెస్‌ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే బిజినెస్‌ ఐడియా మీకోసం ..

1 /12

ఫుడ్ బిజినెస్‌ల పట్ల ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యంలో ఉన్న ట్రెండ్. దీనికి బోలెడు కారణాలు ఉన్నాయి.  

2 /12

నేటికాలంలో ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో, ఆరోగ్యకరమైన వంటకాలను అందించే ఫుడ్ బిజినెస్‌లకు డిమాండ్ పెరిగింది.   

3 /12

అందులో ఫ్యూజన్ కిచెన్‌లు, విదేశీ ఆహారం, వెజిటేరియన్, వీగన్ ఆహారం వంటివి ప్రాచుర్యం పొందుతున్నాయి. అంతేకాకుండా కస్టమర్లు తమకు నచ్చిన విధంగా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఇష్టపడుతున్నారు.   

4 /12

మీకు ఫూడ్ బిజినెస్‌  ప్రారంభించే ఇన్‌ట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్‌ ఐడియా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచి కూడా ప్రారంభించవచ్చు.  

5 /12

 స్నాక్స్ బిజినెస్ అనేది ఆకర్షణీయమైన, లాభదాయకమైన వ్యాపారం. ప్రజలు ఎప్పుడూ ఏదో తినడానికి చూస్తుంటారు. ముఖ్యంగా స్నాక్స్‌కు పెద్ద ఫ్యాన్స్‌ ఉంటారు. 

6 /12

స్నాక్స్ బిజినెస్ ప్రారంభించడానికి ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ రకమైన స్నాక్స్ తయారు చేయాలనుకుంటున్నారు? పకోడీలు, సమోసాలు, బిస్కెట్లు, చిప్స్, లేదా ఇతర ఏదైనా?

7 /12

మీ స్నాక్స్ ఆరోగ్యకరమైనవిగా ఉంటాయా? లేదా రుచికరమైనవిగా ఉంటాయా? అలాగే మీ లక్ష్య కస్టమర్‌లకు ఏ రకమైన స్నాక్స్ నచ్చుతాయి?వాటిని తెలుసుకోవాల్సి ఉంటుంది.   

8 /12

మిల్లెట్స్‌తో తయారు చేసే స్నాక్స్‌కు ప్రస్తుతం మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. ఇవి ఆరోగ్యకరమైనవి కావడంతో పాటు, రుచికరంగా కూడా ఉంటాయి.  

9 /12

మిల్లెట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, బరువును తగ్గించడానికి సహాయపడతాయి, శక్తిని పెంచుతాయి.  

10 /12

మిల్లెట్స్‌తో చెక్కలు, పిండి వంటలు, కేక్‌లు, బిస్కెట్లు, ముద్దలు వంటి అనేక రకాల స్నాక్స్‌ను తయారు చేయవచ్చు. వీటిని మీరు ఇంటి చుట్టుపక్కల ఉండేవారికి లేదా సూపర్‌ మార్కెట్‌లో అమ్మవచ్చు.   

11 /12

మీ బిజినెస్ మరింత పేరు, గుర్తింపు పొందడం కోసం సోషల్‌ మీడియాను ఉపయోగించి రీల్స్‌, ఫొట్స్‌లను ఫోస్ట్ చేయడం వల్ల కస్టమర్‌లు పెరిగే అవకాశం ఉంటుంది.   

12 /12

 స్నాక్స్‌ బిజినెస్‌ ప్రారంభించడానికి మీరు రూ. 10 వేల నుంచి రూ. 50 వేలు పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్‌తో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 50 వేలు సంపాదించుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చుతే ఒకసారి ట్రై చేయండి.