Summer Fitness Tips: దంచి కొడుతున్న ఎండలు.. జిమ్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు..

Exercise Tips: చాలా మంది ప్రతిరోజు జిమ్ లు లేదా జాగింగ్ లకు వెళ్తుంటారు. మెయిన్ గా ఇతర కాలాలకంటే కూడా సమ్మర్ లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జిమ్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.
 

1 /6

కరోనా తర్వాత ప్రతిఒక్కరు కూడా ఆరోగ్యంపై పట్ల జాగ్రత్తగా ఉంటున్నారు. మంచి ఫుడ్ తీసుకుంటున్నారు. అంతే కాకుండా.. ప్రతిరోజు ఉదయాన్నే జాగింగ్ , యోగాలు, జిమ్ లకు వెళ్తున్నారు. డైలీ లైఫ్ లో ఇది ఒక భాగంగా మారింది. కానీ ముఖ్యంగా సమ్మర్ లో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.  

2 /6

చాలా మంది యువత ఉదయాన్నే జిమ్ లకు వెళ్తారు. ఉదయంలేవగానే కొందరు బనానా తిని జిమ్ కు వెళ్తారు. ఇది ఎంతో ప్రమాదకరం. ఇలా అస్సలు చేయకూడదు. అరటి తొందరగా జీర్ణం కాదు. అందుకు కేవలం పరగడుపున నీళ్లు తాగి జిమ్ కు వెళ్లాలి. జిమ్ లో కోచ్ చెప్పినట్లు విధంగా వర్కౌట్ చేయాలి.  

3 /6

కొందరు అతిగా వర్కవుట్ లు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ లు ఉండే ఫుడ్ ను తీసుకొవాలి. జిమ్ తర్వాత గుడ్లు, బనానాలు తినవచ్చు. కానీ కొందరు ఓవర్ నైట్ లో మంచి స్ట్రక్చర్ రావాలనుకుంటారు. దీనికోసం మాత్రలను వాడుతారు.

4 /6

ఇలాంటివి వాడటం వల్ల లేని ప్రమాదం కల్గుతుంది. జిమ్ లలో కోచ్ చెప్పిన విధంగానే ఫుడ్ హ్యబిట్లు అలవాటు చేసుకొవాలి. స్టేప్ బై స్టేప్ బరువులను పెంచుకుంటూ వర్కౌట్ లు చేయాలి. కానీ కొందరు మాత్రం.. ప్రారంభించిన రోజునే భారీగా బరువులు ఎత్తుతుంటారు. దీని వల్ల కండరాలు పట్టేసుకుంటాయి.   

5 /6

జిమ్ చేసేటప్పుడు లేదా జాగింగ్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. గొంతు తడారి పోకుండా కొన్ని నీళ్లను తాగుతుండాలి. ఎక్కువగా బరువులు ఎత్తకుండా చూసుకొవాలి. కొందరికి బీపీ, డయాబెటిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఎక్కువగా వైద్యుల సూచనల మేరకు మాత్రమే జిమ్ లో వర్కౌట్ లు చేయాలి.  

6 /6

ముఖ్యంగా జిమ్ లు, జాగింగ్ లు చేసే వారు.. పెసరలు, శనగలు, గుడ్లు, అరటి పండ్లు, పాలు, నాన్ వెజ్ లు ఎక్కువగా తీసుకొవాలి. రాత్రిపూట బాగా తినాలి. అదే విధంగా జిమ్ లు గంటలు గంటలు చేయకూడదు. ఇలా చేస్తే గుండె జబ్బులు, లేని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలున్నాయి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)