శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అత్యంత వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రపంచం మొత్తం నంద కిశోరుడి ( Flute of Lord Sri Krishna ) వేణువు నాదానిని మంత్రముగ్దం అయిపోతుంది. శ్రీకృష్ణుడు తన జీవితంలో చేసిన అద్భుతాలు ప్రాణకోటి అందరికీ ఆదర్శాలు. అందుకే ఈ రోజు మాధవుడి జీవితం నుంచి మానవుడి జీవితానికి పనికొచ్చే ఏడు ముఖ్యమైన సూత్రాలను చదువుదాం. వీలైతే పాటిద్దాం.
ఒక దూడ తన తల్లిని ఏ వెతుక్కుంటూ ఏ విధంగా వెళ్తుందో.. అదే విధంగా కర్మ కూడా మనిషిని వెతుక్కుంటూ వెళ్తుంది
భగవద్గీతో శ్రీకృష్ణుడి వాణి, ప్రతీ వచనం అజరామరం. అందులో మాధువుడు ఇలా అన్నాడు... మనిషి శరీరం ఏదో ఒక రోజు మట్టిలో కలిసి పోతుంది. కానీ ఆత్మ మాత్రం శాశ్వతం. ఆత్మకు మరణం లేదు. ఆత్మ పుట్టదు. ఆత్మ మరణించదు.
తను భగవంతుడిని అయినంత మాత్రాన.. ఒకరికి కావాలని ఫలాలు అందించను అని.. ఒకరి విధిని తను రాయలేను అని తెలిపాడు.
మనిషి తన కర్మల వల్లే తన విధిని నిర్ధేశిస్తాడన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే మన భవిష్యత్తు నిర్మాణం మన చేతిపనే అని స్పష్టం అవుతుంది.
మనిషి పాత వస్త్రాలు త్యజించి..కొత్త వస్త్రాలు ధరించిన విధంగానే.. ఆత్మ కూడా పాత శరీరాన్ని విడనాడి కొత్త శరీరాన్ని చేరుకుంటుంది
ఏదైనా కోల్పోతే ఏం చేయాలో శ్రీకృష్ణుడు తెలిపారు. కోల్పోయిన దాని గురించి బాధ పడటం మంచిది కాదు. పేరు, పని, కీర్తి, జననం అనే ప్రతీది నీకు ఇతరుల వల్లే చేకూరింది. ఈ ప్రపంచంలోకి ఖాళీ చేతులతో వచ్చాం. ఖాళీ చేతులతో తిరిగి వెళ్తాం.
జీవితంలో ఏం జరిగినా అది మన మంచికే..ఏం జరగనున్నా అది మన మంచికే..అందుకే శ్రీకృష్ణుడు అంటాడు... ఏం జరిగినా అది మన మంచికే అని