LDL Cholesterol: కొలెస్ట్రాల్ తీవ్రమైతే కాళ్లలో ఈ లక్షణాలు, తస్మాత్ జాగ్రత్త

LDL Cholesterol: శరీరంలో అధిక కొలెస్ట్రాల్ అనేది ఓ ప్రమాదకర పరిస్థితిని సూచిస్తుంది. కొలెస్ట్రార్ పెరిగే కొద్దీ గుండె వ్యాధుల ముప్పు అధికమౌతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్ సంభవిస్తాయి. ఇవి ప్రాణాంతకం కావచ్చు కూడా. 

LDL Cholesterol: అందుకే కొలెస్ట్రాల్ సమస్యను సకాలంలో గుర్తించి పరిష్కరించుకోవాలి. డైట్ కంట్రోల్, వ్యాయామం ద్వారా చాలా సులభంగా ఈ సమస్యను తగ్గించవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే వివిధ రకాల లక్షణాలు బయటపడతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే కాళ్లలో కన్పించే లక్షణాల గురించి తెలుసుకుందాం..

1 /5

కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువైతే కన్పించే ప్రమాదకర లక్షణాల్లో మరొకటి కాళ్లు తిమ్మిరి పట్టడం. ధమనుల్లో ఏర్పడే ప్లక్స్ కారణంగా ఇలా జరుగుతుంది. 

2 /5

కొలెస్ట్రాల్ కాలి ధమనుల్ని సంకోచింపచేసినప్పుడు కాలి చర్మం రంగు మారిపోతుంది. కాళ్లు నీలం లేదా వంకాయ రంగులో కన్పించవచ్చు.

3 /5

కొలెస్ట్రాల్ కాలి ధమనుల్ని సంకోచించేలా చేస్తుంది. ఫలితంగా కాళ్లలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దాంతో ఏ చిన్న దెబ్బ తగిలినా తీవ్రంగా మారవచ్చు.

4 /5

కొలెస్ట్రాల్ కాలి ధమనులు సంకోచించేలా చేస్తాయి. దీనివల్ల రక్త ప్రవాహం తగ్గిపోతుంది. కాల్లు చల్లబజడినట్టు కన్పిస్తుంది. 

5 /5

కొలెస్ట్రాల్ కాళ్ల ధమనుల్లో పేరుకున్నప్పుడు రక్త ప్రవాహంలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా కాళ్లలో , మోకాళ్లలో నొప్పులు రావడం, తీవ్రమైన అలసట సంభవిస్తాయి.