Laptop Battery Tips: తరచూ ఈ పొరపాట్లు చేస్తే ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది

ఆధునిక జీవన విధానంలో ల్యాప్‌టాప్ వినియోగం తప్పనిసరిగా మారింది. అయితే ల్యాప్‌టాప్ వినియోగించేటప్పుడు ప్రదానంగా ఎదుర్కొనే సమస్య బ్యాటరీ ఛార్జింగ్ నిలబడకపోవడం. తరచూ ఛార్జ్ చేయాల్సి వస్తుంటుంది. పాత ల్యాప్‌టాప్స్‌కు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ల్యాప్‌టాప్ బ్యాటరీ తరచూ పాడవకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. మనం చేసే తప్పుుల వల్లే బ్యాటరీ త్వరగా పాడవుతుంటుంది. ఆ టిప్స్ ఎంటో తెలుసుకుందాం.

Laptop Battery Tips: ఆధునిక జీవన విధానంలో ల్యాప్‌టాప్ వినియోగం తప్పనిసరిగా మారింది. అయితే ల్యాప్‌టాప్ వినియోగించేటప్పుడు ప్రదానంగా ఎదుర్కొనే సమస్య బ్యాటరీ ఛార్జింగ్ నిలబడకపోవడం. తరచూ ఛార్జ్ చేయాల్సి వస్తుంటుంది. పాత ల్యాప్‌టాప్స్‌కు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ల్యాప్‌టాప్ బ్యాటరీ తరచూ పాడవకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. మనం చేసే తప్పుుల వల్లే బ్యాటరీ త్వరగా పాడవుతుంటుంది. ఆ టిప్స్ ఎంటో తెలుసుకుందాం.

1 /5

ల్యాప్‌ట్యాప్‌లో అవసరానికి మించి గేమింగ్ చేయకూడదు. ఇలా చేస్తే ప్రోసెసర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అటు బ్యాటరీ ఇటు ల్యాప్‌టాప్ రెండూ వేడెక్కుతుంటాయి. బ్యాటరీ తరచూ వేడెక్కుతుంటే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది.

2 /5

ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే చోట వినియోగించడం తగ్గించేయాలి. లేకపోతే ల్యాప్‌టాప్ బ్యాటరీపై ప్రభావం పడుతుంది. తరచూ ఇలా చేస్తే మాత్రం బ్యాటరీ చాలా త్వరగా పాడయిపోతుంది. 

3 /5

ల్యాప్‌టాప్ స్టోరేజ్ తక్కువగా ఉన్నా సరే వీడియోలు ఎడిట్ చేస్తుంటే ఆ ప్రభావంతో ప్రోసెసర్‌పై ఒత్తిడి పెరిగి ల్యాప్‌టాప్ బ్యాటరీ వేడెక్కిపోతుంది. దాంతో బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది. 

4 /5

ల్యాప్‌ట్యాప్ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు కూడా ప్రోసెసర్ పనిచేసేటప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది. ఈ ప్రభావం బ్యాటరీపై పడుతుంది. 

5 /5

లోకల్ ఛార్జర్ ఎప్పుడూ వినియోగించకూడదు. దీనివల్ల ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. ల్యాప్‌టాప్ బ్యాటరీ ఛార్జ్ చేసేందుకు అందుకు తగ్గ కంపెనీ ఛార్జరే వినియోగించాలి. లేకపోతే బ్యాటరీ వేడెక్కిపోతుంటుంది.