Bandla Ganesh Son : కేటీఆర్, బండ్ల గణేష్ కొడుకులు ఒకే స్కూల్.. గ్రాడ్యుయేషన్ డే సెలెబ్రేషన్స్ పిక్స్ వైరల్

Bandla Ganesh Son School స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో బండ్ల గణేష్ కొడుకులు సందడి చేశారు. బండ్ల గణేష్ కొడుకులిద్దరూ కూడా తమ స్కూల్‌ చదువల్ని పూర్తి చేసుకున్నారు. 12వ తరగతి పూర్తయిన సందర్భంగా పట్టాలు పుచ్చుకున్నారు.

  • Apr 19, 2023, 10:11 AM IST
1 /5

సెలెబ్రిటీల పిల్లలు చదివే స్కూల్‌ల గురించి ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. మహేష్‌ బాబు కొడుకు, పవన్ కళ్యాణ్‌ పిల్లలు, సీఎం మనవడు చదివే స్కూల్ వివరాలు ఎప్పుడూ జనాలకు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి.

2 /5

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్‌లోనే సెలెబ్రిటీల పిల్లలు చదువుతుంటారు. కేటీఆర్ కొడుకు హిమాన్ష్, బండ్ల గణేష్ పిల్లలు ఓక్రిడ్జ్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు.

3 /5

కేసీఆర్ మనవడు హిమాన్ష్, బండ్ల గణేష్ కొడుకులిద్దరూ గచ్చిబౌలీలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యేయేషన్ పట్టాను పొందారు.

4 /5

ఇక హిమాన్ష్ కోసం కేటీఆర్, కేసీఆర్ ఇలా సతీసమేతంగా కనిపించారు. హిమాన్ష్‌ తన తాత కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు.

5 /5

గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పిల్లల అమ్మానాన్నలు, కుటుంబ సభ్యులంతా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకల్లో బండ్ల గణేష్ ఫ్యామిలీ ఇలా కనిపించింది.