Krithi Shetty: మకాం మార్చిన కృతి శెట్టి.. నెక్స్ట్ ప్లాన్ అదే!

Krithi Shetty upcoming movies: కృతి శెట్టి గురించి…తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరోయిన్.. ఆ తరువాత వరుసగా రెండు సినిమాలతో విజయం అందుకొని.. దూసుకుపోయింది. అయితే ఆ తరువాత నుంచి వరుస ఫ్లాపులు అందుకుంటూ సతమతమవుతోంది..

1 /5

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. వైష్ణవ తేజ్ హీరోగా వచ్చిన ఈ చిత్రానికి.. బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించారు. మొదటి చిత్రంతోనే విజయం అందుకోవడం.. ఎవరికైనా నిజంగానే అదృష్టం. అలాంటిది మన హీరోయిన్ మొదటి సినిమాతోనే 100 కోట్ల సినిమా అందుకుంది.   

2 /5

ఆ తరువాత వెంటనే.. నానితో శ్యామ్ సింగరాయ.. సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ చిత్రం కూడా హిట్ అవ్వడంతో.. ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక నాగచైతన్య తో వచ్చిన బంగార్రాజు చిత్రం కూడా విజయం సాధించింది. 

3 /5

మొత్తానికి వరసగా మూడు విజయాలు సాధించి.. తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది ఈ హీరోయిన్. కానీ అసలు కథ.. ఆ మూడు సినిమాల తరువాత మొదలయ్యింది. అప్పటి నుంచి కృతికి వలస అపజయాలు రావడం మొదలయ్యాయి. 

4 /5

దానికి తోడు.. అసలు తన పాత్రకి విలువ లేని సినిమాలు చెయ్యడం.. ఈ హీరోయిన్ కి మరింత మైనస్ అయింది. ఈ క్రమంలో ప్రస్తుతం కృతి మకాం మార్చినట్టు తెలుస్తోంది. ఈమధ్య వచ్చిన శర్వానంద్ మనమే కూడా ఫ్లాప్ అవ్వడంతో.. కృతికి తెలుగులో అవకాశాలు అస్సలు రావడం లేదు. అందుకే మన హీరోయిన్ కాస్త తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. 

5 /5

ప్రస్తుతం కృతికి అక్కడ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలలో.. ఒక్కటి హిట్ అయిన.. కృతికి అక్కడ మళ్లీ వరుస అవకాశాలు రావడం ఖాయం. మరి అక్కడ అవకాశాలన్న ఉపయోగించుకొని.. స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందేమో వేచి చూడాలి.