Kriti Shetty Photos; ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మలయాళం ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత చాలామంది హీరోయిన్లు బయటకు వచ్చి ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అనే విషయంపై క్లారిటీ ఇస్తున్నారు. మాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలలో కూడా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు అందరిని ఉలిక్కిపడేలా చేశాయి. దీంతో అనసూయ , పూనమ్ కౌర్ , కరాటే కళ్యాణి, చిన్మయి లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా జానీ మాస్టర్ పై వ్యతిరేకంగా పోస్ట్ పెడుతున్నారు. ఇతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహిళా సంఘాలతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా జానీ మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత యువతికి అండగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ బ్యూటీ కృతి శెట్టి కూడా స్పందిస్తూ భయమేస్తోంది అంటూ ఊహించని కామెంట్లు చేసింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు ఒక్కొక్కసారి నిద్ర లేకుండా చేస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. బాధితులు అనుభవించిన మానసిక క్షోభను తలుచుకుంటే భయం వేస్తోంది ..ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చే కొత్త వారు ముందే ఇలాంటి సంఘటనల గురించి తెలుసుకోవడం ఉత్తమం. అప్పుడు వారికి ఇండస్ట్రీ పట్ల ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది.
భవిష్యత్తులో సానుకూల మార్పులు వస్తాయి అని నేను అభిప్రాయపడుతున్నాను అంటూ కృతి శెట్టి తెలిపింది. ఇకపోతే ఇలాంటి విషయాలు వ్యక్తిగతంగా తనను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయని తెలిపింది కృతి శెట్టి. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే మహిళలు ఆలోచించి అడుగులు వేసి సలహాలు తీసుకోవాలని తెలిపింది.
ప్రస్తుతం కృతి శెట్టి తెలుగు , తమిళ్ చిత్రాలలో నటిస్తోంది. తాజాగా ఈమె నటించిన ఏఆర్ఎం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని పూర్వ వైభవాన్ని అందించింది.. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.35 కోట్లు రాబట్టి కృతి శెట్టికి మంచి విజయాన్ని అందించింది.