King Cobra Snake Lifespan: పాములు ఎక్కువగా కప్పలు, ఎలుకలను తిని బతుకుతాయని తెలుసు. కానీ అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి అయిన కింగ్ కిబ్రో ఏం తింటుందో తెలుసా..? ఇవి కప్పలు, ఎలుకలను తినవు. వీటికి ఇష్టమైన ఆహారం వేరే ఉంది. ఆహారం కోసం ఇతర జీవుల్లానే కింగ్ కోబ్రా వేటాడి తింటుంది. కింగ్ కోబ్రా ఏ జీవులను వేటాడుతుంది..? వాటి జీవన విధానం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రపంచంలో అత్యంత డేంజరస్ స్నేక్స్‌లో కింగ్ కోబ్రా ముందు వరుసలో ఉంటుంది. ఈ పాములు మనుషులపై ఈజీగా అటాక్ చేస్తాయి.
ఇతర పాములు మాదరికి కింగ్ కోబ్రాలు ఎలుకలు, కప్పలను తినవు. కింగ్ కోబ్రాలు ఎక్కువగా కోల్డ్ బ్లడెడ్ జంతువులను వేటాడుతాయి.
ముఖ్యంగా ఇతర పాములపై దాడి చేసి తినేస్తాయి. 10 అడుగుల పొడవు వరకు ఆసియా ఎలుక పాములు, కొండచిలువలు వంటిపై దాడి చేస్తాయి. విషపూరితమైన భారతీయ నాగుపాములను; చిన్న కింగ్ కోబ్రాలను కూడా తింటాయి.
కింగ్ కోబ్రాలు ఎక్కువగా దట్టమైన అడవులు, వెదురు పొదలు, దట్టమైన మడ చిత్తడి నేలల్లోని ప్రవాహాలలో నివసిస్తాయి. ఉష్ణోగ్రత, తేమ సాపేక్షంగా స్థిరంగా ఉండే ప్రవాహాల దగ్గర ఇవి ఉంటాయి.
కింగ్ కోబ్రాలు ఆగ్నేయ, దక్షిణ ఆసియాకు చెందినవి. ఇవి ఉత్తర భారతదేశంలో తూర్పు నుంచి దక్షిణ చైనా వరకు, దక్షిణాన మలయ్ ద్వీపకల్పం అంతటా, తూర్పు నుంచి పశ్చిమ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి.
కింగ్ కోబ్రాల సంతానోత్పత్తి సాధారణంగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరుగుతుంది. తల్లి గుడ్లు పెట్టే ముందు ఆకులతో గూడు నిర్మిస్తుంది. ఒక పాము 21 నుంచి 40 తెల్లటి, తోలు గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తరువాత ఆకులతో కప్పి ఉంచి.. అవి పొదిగే వరకు జాగ్రత్తగా చూసుకుంటుంది.
కింగ్ కోబ్రాలు అడవిలో దాదాపు 20 సంవత్సరాలు జీవిస్తాయి. కింగ్ కోబ్రాను చంపితే ఆరు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.