Kiccha Sudeep Divorce: ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. దాదాపు 15 యేళ్లుగా వైవాహిక బంధంలో కలిసి ఉన్న ఈ జంట.. గతంలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ ఒక అమ్మాయి కోసం.. విరాకులు వరకు వెళ్లిన వీళ్లు.. మళ్లీ ఒక్కటి అయ్యారని సమాచారం. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ ఒక కన్నడ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడే. హీరోగా ఎన్నో చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈగ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కనిపించిన సుదీప్, విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు.
కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2001 అక్టోబర్ 18న ప్రియా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు సుదీప్. అలా పెళ్లయిన 14 సంవత్సరాల తర్వాత అంటే 2015లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దాదాపు విడిపోదామని అనుకున్నారు. కోర్టులో విడాకులు కూడా ఫైల్ చేశాక.. మళ్లీ కలిసి పోయారు. ముఖ్యంగా వారిద్దరి మధ్య జరుగుతున్న వివాదాలను ఎక్కడ కూడా బయటకి పూర్తిగా తెలియనివ్వలేదు.
ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్నేహితుల మధ్య అపార్ధాలు వస్తే కొంతకాలం మాట్లాడుకోకుండా ఉండగలం. కానీ వివాహంలో అలా కాదు కదా.. ఇక మేము కూడా విడిపోవాలి అనుకున్నప్పుడు మా కూతురు శాన్వి మాకు గుర్తుకొచ్చింది.
ఇక శాన్వి బాధ్యతను నా భార్యకే వదిలేసాను. ఆ సమయంలో రూ.19 కోట్ల భరణం కూడా నేను ఇవ్వాల్సి వచ్చేది. కానీ మా ఇద్దరి మధ్య సఖ్యత కుదరడంతో పరిస్థితులు చక్కబడ్డాయి .మళ్ళీ మేము ఒక్కటయ్యాము.
ఒక రకంగా చెప్పాలి అంటే మా పాప భవిష్యత్తు కోసమే మేము... ఒకరికొకరు మళ్లీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అప్పటినుంచి మేమిద్దరం విడాకుల దిశగా ఆలోచన చేయలేదు. అసలు మా విడాకుల మాట కూడా బయటకు రానివ్వలేదు అంటూ తెలిపారు సుదీప్. ఇకపోతే 2020 బిగ్ బాస్ సీజన్ 7 లో వీరి పెళ్లిరోజు సందర్భంగా సుదీప్ తన భార్య ప్రియా తో కలిసి కేక్ కూడా కట్ చేసిన విషయం తెలిసిందే.