Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ వినాయకుడి కర్రపూజ.. ఈసారి మహగణపతి ఎత్తు ఎంతో తెలుసా..?

Khairatabad Ganesh Height 2024: దేశంలో అనేక పండుగలను ఎంతో భక్తితో, ఉల్లాసంగా జరుపుకుంటారు. ఇక హైదరాబాద్ నగరవాసులు మాత్రం.. వినాయక చవితి  వేడుకల కోసం ఎంతో ఎదురు చూస్తుంటారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

1 /8

మన దేశంలో అనేక పండుగలు ఉన్నాయి. హిందువులకు అయితే.. బోలేడు పండుగలు ఉన్నాయని చెప్పుకొవచ్చు. దీపావళి, దసరా, సంక్రాంతి, రాఖీ, వినాయక చవితి. వీటిలో గణేషుడి నవరాత్రి వేడుకలను ఎంతో ఫుల్ జోష్ తో నిర్వహిస్తారు. 

2 /8

ఇక హైదరబాద్ నగరవాసుల వరకు వస్తే.. ఫెమస్ ఖైరతాబాద్ మహగణపతిని ఎంతో భక్తితో ప్రతిష్టించి పూజించుకుంటారు. కొన్ని వందల ఏళ్ల నుంచి ఖైరతాబాద్ విగ్రహన్ని ఉత్సవకమిటీ వారు ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తు వస్తున్నారు. 

3 /8

ప్రత్యేకంగా హైదరాబాద్ కు గణేష్ నవరాత్రుల్లో ఎవరు వచ్చిన కూడా తప్పకుండా వినాయకుడిని దర్శించుకునే వెళ్తారు. ఈ క్రమంలో ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడి పూజలు షూరు అయ్యాయి. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిష్టాపన కర్రపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.  

4 /8

 గతేడాది ఇక్కడి గణపయ్య తన ఎత్తుతో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. భాగ్య నగరం అంటే.. చాలా మందికి ఖైరతాబాద్ గణేషుడు, ఆయన ఎత్తుగురించి ఎప్పుడు వార్తలలో చర్చ జరుగుతు ఉంటుంది. ఈసారి సెప్టెంబర్ 7 వినాయక చవితి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీవాళ్లు కర్రపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

5 /8

ఈ ఏడాది వినాయక చవితి పురస్కరించుకుని.. ఖైరతాబాద్​లో 70 అడుగుల మహగణేషుడి.. మట్టి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నట్లు ఉత్సవ కమిటితో పాటు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా మట్టి వినాయకుణ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

6 /8

ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించినట్లు చెప్పారు. గణేశ్‌ ఉత్సవాలకు ఈ ఏడాది కూడా మంచి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తామని వెల్లడించారు. 

7 /8

తొలిపూజ కార్యక్రమంను తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌  నిర్వహిస్తారని చెప్పారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో 11 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని దానం నాగేందర్ పేర్కొన్నారు.

8 /8

ఇదిలా ఉండగా.. ప్రతిఏటా ఖైరతాబాద్ గణపతిని సరికొత్త రూపంలో భక్తులకు దర్శనమిచ్చేలా రూపొందిస్తుంటారు. ఈ మహగణపతిని చూడటానికి ఏపీ,తెలంగాణలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో పాటు లక్షలాదిగా భక్తులు మహగణపతి ఆశీస్సుల కోసం వస్తుంటారు.