Keerthy Suresh: పెళ్లై పట్టుమని పదిరోజులు కాలేదు.. అప్పుడే భర్తను పక్కనపెట్టేసిన కీర్తి సురేష్‌, అందుకేనా?

Keerthy Suresh Wedding: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి డిసెంబర్ 12వ తేదీ గోవా వేదికగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను ఈమె పెళ్లి చేసుకుంది.. అయితే తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. పెళ్లై పట్టుమని పది రోజులు కూడా కాలేదు పూర్తిగా భర్తను దూరం పెట్టేసింది. అని కీర్తి సురేష్ పై నెట్టింట వార్త వైరల్ అవుతుంది.
 

1 /7

కీర్తి సురేష్ 'మహానటి' సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్న ఈమె వివిధ రకాల పాత్రల్లో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ప్రేమ వివాహం కూడా చేసుకుంది ఈ మహానటి.  

2 /7

కీర్తి సురేష్ పెళ్లి మొదట్లో హిందూ సంప్రదాయంలో వైభవంగా జరిగింది. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో కూడా జరిగింది. ఎందుకంటే ఆంటోని తట్టిల్  క్రిస్టియన్ కాబట్టి ఏమే క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు.  

3 /7

తాజాగా బిజీగా కనిపిస్తున్న కీర్తి సురేష్ ఇటీవలే తన మంగళసూత్రంతో కూడా మీడియా ముందు కనిపిస్తూ హల్చల్ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

4 /7

అయితే తెలుగు, తమిళ సినిమాలో తను స్టార్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా  బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న కీర్తి సురేష్ ఈ మధ్య బాగా బిజీగా కనిపిస్తుంది. హీరోల వరుణ్ ధావన్ తో కలిసి 'బేబి జాన్' అనే సినిమాలో నటిస్తోంది.  

5 /7

అయితే పెళ్లయిన వెంటనే హనీమూన్ లేదా వర్క్ లైఫ్‌కు కాస్త దూరంగా ఉంటుంది అనుకున్నారు అందరూ. అయితే, భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుందని తరుణంలో ఇలా బిజీ బిజీగా కీర్తి సురేష్ కనిపిస్తోంది.  

6 /7

'బేబీ జాన్' సినిమాకు వరుణ్ ధావన్ తో కలిసి ముంబైలో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. పెళ్లి అయిన పది రోజులకే కీర్తి సురేష్ బిజీగా కనిపించడంతో ఈమె వర్క్ డెడికేషన్ కి అందరూ ఫీదా అవుతున్నారు.  

7 /7

కానీ, మరికొందరు పెళ్లయిన వెంటనే భర్త కంటే ఎక్కువ మళ్ళీ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.