Keerthy Suresh: కీర్తి సురేష్ సంక్రాంతి సంబరాలు.. ముగ్గు వేస్తూ ఫ్యాన్స్ ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న హీరోయిన్

Keerthy Suresh Sankranthi: మహానటి సినిమాతో నేషనల్ అవార్డు సైతం గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఆ సినిమా దగ్గర నుంచి కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
 

  • Jan 16, 2024, 20:49 PM IST
1 /7

Keerthy Suresh Sankranthi: నేను‌‌.. శైలజా.‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగులో ఎన్నో ఆఫర్లు తెచ్చుకునింది.

2 /7

ఆ తరువాత ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన ఎన్నో చిత్రాలు మంచి విజయం కూడా సాధించాయి.

3 /7

కానీ కీర్తి సురేష్ కి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరిగిపోని పేరు తెచ్చి పెట్టింది మాత్రం మహానటి చిత్రం. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అద్భుతమైన నటన.. ఆమెకు నంది అవార్డు సైతం తెచ్చిపెట్టింది.

4 /7

ఇక ఆ తరువాత కీర్తి సురేష్ చేసిన సినిమాలు అన్నీ ప్టాప్ టాక్ తెచ్చుకున్నాయి. కాగా ఫైనల్ గా గత సంవత్సరం విడుదలైన దసరా సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది కీర్తి.

5 /7

ఈ నేపథ్యంలో కీర్తి సంక్రాంతి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలతో ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ హీరోయిన్.

6 /7

రెడ్ శారీ.. బ్లూ బ్లౌజ్ తో.. సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఫోటోలు షేర్ చేసింది కీర్తి సురేష్. కొన్ని ఫోటోలలో ముగ్గు వేస్తూ మరికొన్ని ఫోటోలలో పొంగలి వండుతూ.. ఇంకొన్ని ఫోటోలలో తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో అందుకని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించింది.

7 /7

ప్రస్తుతం కీర్తి సురేష్ కి సంబంధించిన ఈ సంక్రాంతి సంబరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ తన అభిమానుల దగ్గర నుంచి స్వీట్ కామెంట్స్ పొందుతున్నాయి.