Keerthy Suresh: తెల్ల చీరలో భువి నుంచి దిగివచ్చిన.. ఏంజెల్ లాగా కీర్తి సురేష్..

Keerthy Suresh mesmerizes in instagram in white saree: కీర్తి సురేష్ గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దాదాపు అన్ని భాషలలోనూ.. సినిమాలు చేసిన ఈ హీరోయిన్ త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 
 

1 /5

సౌత్ ఇండియాలో.. దాదాపు అన్ని భాషలలోనూ నటించిన హీరోయిన్ కీర్తి సురేష్. ముఖ్యంగా తెలుగు, తమిళంలో.. ఈ హీరోయిన్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్..  

2 /5

ఆ తరువాత నానితో చేసిన నేను లోకల్ కూడా కీర్తి సురేష్ కి మంచి విజయం సాధించిపెట్టింది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  వచ్చిన మహానటి సినిమా కీర్తి సురేష్ రేంజ్ మార్చేసింది. ఈ చిత్రంకి గాను నేషనల్ అవార్డు సైతం అందుకుంది ఈ హీరోయిన్.

3 /5

అయితే ఆ తరువాత కీర్తి నటించిన ఎన్నో చిత్రాలు ఫ్లాప్ గా మిగిలాయి. కానీ మళ్ళీ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో.. మరోసారి విజయం అందుకుంది కీర్తి సురేష్. ఇక అప్పటి నుంచి మళ్లీ వలస అవకాశాలు రావడం మొదలయ్యాయి. 

4 /5

ఈ మధ్యనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 AD సినిమాలో బుజ్జి క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న.. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 

5 /5

ఈ క్రమంలో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో కీర్తి సురేష్ వైట్ శారీలో కనిపిస్తూ.. అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని  చేస్తోంది.